Success Story: చిన్న ఉద్యోగిగా ఉంటూ పెద్ద వ్యాపారాలు చేయాలని మనలో చాలా మందికి కల ఉంటుంది. అయితే దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో అందరు భయపడేది ముందుగా నష్టపోతే ఏంటనే దాని గురించే.
ఇలాంటి అన్ని అవరోధాలను అధిగమించి దేశంలో ముందుకు సాగిన వృద్ధ బిలియనీర్ 92 ఏళ్ల లచ్మన్ దాస్ మిట్టల్. ప్రస్తుతం ఆయన నికర విలువ 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద ట్రాక్టర్ తయారీదారు సోనాలికా గ్రూప్ స్థాపించారు లచ్మన్ దాస్. ఆయన తన వ్యాపార ప్రయాణాన్ని 60 ఏళ్ల వయస్సులో ప్రారంభించారు. అలా జీవితంలో విజయం సాధించటానికి చాలా కృషి చేశారు.

దేశంలో అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థను స్థాపించిన లచ్మన్ దాస్ ఒకప్పుడు ఎల్ఐసీ ఏజెంట్. కానీ 1996లో ట్రాక్టర్ల తయారీని ప్రారంభించా.. తర్వాత సోనాలికా ట్రాక్టర్స్‌ను స్థాపించారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో సోనాలికా ట్రాక్టర్స్ అతిపెద్ద తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 5 దేశాల్లో తయారీ యూనిట్లను కలిగి ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.
ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక లచ్మన్ దాస్ మిట్టల్ ఉర్దూ, ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో చేరాడు. ఎంఏ ఇంగ్లీష్ గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత 1955లో ఎల్ఐసీలో చేరారు. అలా తన పొదుపు మెుత్తంతో వ్యవసాయ పరికరాలను విక్రయించే సైడ్ వెంచర్‌ను ప్రారంభించడానికి ఉపయోగించారు. కానీ ఈ వెంచర్ విఫలమై దాస్ దివాళా తీశారు. కానీ పట్టువిడవక కొన్ని సంవత్సరాల తర్వాత చివరికి విజయాన్ని సాధించారు.
లచ్‌మన్ దాస్ మిట్టల్ కుమారులు అమృత్ సాగర్ మిట్టల్, దీపక్ మిట్టల్ ప్రస్తుతం సోనాలికా గ్రూప్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు కుమారులు కంపెనీని ముందుకు నడుపుతున్నప్పటికీ.. లచ్మన్ దాస్ మాత్రం బిజీగా వృత్తిపరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వృద్ధ బిలియనీర్ ఇప్పటికీ ప్రతిరోజూ తన కలల వ్యాపారం కోసం పనిచేస్తూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications