Tax Filing: అలా టాక్స్ ఫైలింగ్ చేయకపోతే నోటీసులొస్తాయ్.. జరిమానా కట్టాల్సిందే..!!
ITR Filing: ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగియటంతో దేశంలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే వ్యక్తులు యాక్టివ్ అయ్యారు. గడచిన ఆర్థిక సంవత్సరానికి తమ పన్ను చెల్లింపు ప్రక్రియను ఇప్పటికే చాలా మంది ప్రారంభించారు. పెట్టుబడుల నుంచి మినహాయింపుల వరకు అన్ని వివరాలను సేకరిస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు ముందు టాక్స్ చెల్లింపుదారులు కాస్త ముందస్తు ప్రిపరేషన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. వీరు అన్ని లావాదేవీలు, పన్ను మినహాయింపులను ఫారమ్-16, AIS, ఫారమ్ 26ASతో సరిపోల్చాలని చెబుతున్నారు. వేతన ఉద్యోగులకు ఈ నెలలోగా ఫారం-16ను కంపెనీలు అందిస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా పన్ను అధికారుల నుంచి నోటీసులను మీ నిరోధించవచ్చు. ఇందులో భాగంగా ముందుగా చేయాల్సిన కొన్ని పనులను ఇప్పుడు తెలుసుకుందాం..

1. టాక్స్ చెల్లింపుదారులు ఇంకా పాన్-ఆధార్ కార్డులను లింక్ చేయకుంటే ముందుగా ఈ పనిని పూర్తి చేయాలి.
2. సమయానికి టాక్స్ వాపసు పొందాలనుకుంటే.. మీరు బ్యాంక్‌లో ఇచ్చిన మొబైల్ నంబర్, పాన్ నంబర్ వివరాలు సరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఏవైనా తప్పులను గుర్తిస్తే వెంటనే కేవైసీ పూర్తి చేసేందుకు బ్యాంకును సంప్రదించండి.
టాక్స్ పేయర్ నివారించాల్సిన తప్పులు:
1. ITR ఫారమ్ పూరిస్తున్నప్పుడు పన్ను చెల్లింపుదారులు తన పేరు, పాన్, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి అన్ని వ్యక్తిగత సమాచారాన్ని ఎటువంటి తప్పులు లేకుండా పూరించి దానిని నిర్థారించుకోవాలి.
2. ఆదాయ వనరు, ఆదాయ రకాన్ని బట్టి టాక్స్ పేయర్స్ సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తప్పుడు ఫారమ్ పూరించడం సమస్యలను కలిగించటంతో పాటు జరిమానాలకు దారి తీస్తుంది.
3. జీతం, వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, మూలధన లాభాలతో సహా అన్ని ఇన్కమ్ సోర్సెస్ నుంచి పొంది సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా ఐటీఆర్‌లో పొందుపరచాలి. వీటి వివరాలు దాచడం వల్ల పన్ను ఎగవేతకు జరిమానా విధించే ప్రమాదం ఉంటుంది.
4. ITRలో యజమాని లేదా డిడక్టర్ జారీ చేసిన ఫారమ్ 16, 16-A నుంచి టీడీఎస్ వివరాలను తప్పనిసరిగా చేర్చాలి. సరైన TDS సమాచారాన్ని అందించడంలో విఫలమైతే పెనాల్టీకి దారి తీయవచ్చు.
5. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, 80D, 80G కింద అర్హత కలిగిన పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి అన్ని పెట్టుబడులు, ఖర్చులు, తగ్గింపులను సరిగ్గా ప్రకటించాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే చెల్లించాల్సిన పన్ను మెుత్తం పెరుగుతుంది.

6. పన్ను చెల్లింపుదారుడు సేవింగ్స్ అకౌంట్, FD లేదా ఇతర వనరుల నుంచి పొందిన వడ్డీ గురించి సరైన సమాచారాన్ని అందించాలి. వడ్డీ ఆదాయాన్ని వెల్లడించడం తప్పనిసరని గుర్తుంచుకోండి.
7. ITRలో అందించి అన్ని వివరాలు తప్పనిసరిగా వార్షిక సమాచార ప్రకటన (AIS), ఫారమ్ 26ASతో సరిపోలాలి. AIS యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఇందులో మీ ఆదాయపు పన్ను సంబంధిత సమాచారం వివరాలు ఉంటాయి.
8. ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ మీ పన్ను బ్రాకెట్‌ను బట్టి మారవచ్చు. కాబట్టి దాన్ని సరిగ్గా తనిఖీ చేయండి. ఐటీఆర్‌ను ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా చెల్లించాల్సి రావొచ్చు.
9. ITR ఆన్‌లైన్‌లో ఫైల్ చేసిన తర్వాత, దానిని ఎలక్ట్రానిక్‌గా ధృవీకరించండి. ఇది లేకుండా ప్రక్రియ పూర్తి కాదు. ఐటీఆర్‌ని డిపార్ట్‌మెంట్ చిరునామాకు పంపడం ద్వారా కూడా ధృవీకరించవచ్చు.
10. ఆదాయం, పెట్టుబడులు, పన్ను మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలు, రసీదులు, ఆధారాల రికార్డులను నిర్వహించండి. ధృవీకరణ కోసం లేదా భవిష్యత్తులో ఏదైనా పన్ను విచారణ విషయంలో ఇవి వివరణ ఇచ్చేందుకు అవసరం కావొచ్చు.


Click it and Unblock the Notifications


