Credit Cards: సామాన్యంగా మనలో చాలా మందికి క్రెడిట్ కార్డు అనగానే నెగటివ్ ఆలోచనలే ఎక్కువ వస్తుంటాయి. అవి మనల్ని అప్పులపాలు చేయటానికే బ్యాంకులు అంటగడతాయనే ధోరణి ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అసలు క్రెడిట్ కార్డులు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే తప్పకుండా కార్డ్ ఉండాల్సిందేనని మీకు కూడా అనిపించక మానదు.
అసలు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీరు చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. రోజువారీ ఖర్చులన్నింటినీ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి చెల్లించటం ద్వారా.. ఎయిర్ మైల్స్, హోటల్ పాయింట్‌లు, గిఫ్ట్ వోచర్‌లు, క్యాష్‌బ్యాక్ వంటి అనేక రివార్డ్‌లను పొందవచ్చు. ఒక వ్యక్తి తన 2016 నుంచి క్రెడిట్ కార్డును వినియోగించటం ప్రారంభించి దాదాపు 2 మిలియన్ ఎయిర్ మైళ్లు, హోటల్ పాయింట్లను, గిఫ్ట్ వోచర్లు, క్యాష్ బ్యాక్స్ పొందాడు. ఎయిర్‌లైన్‌కు బదిలీ చేస్తే, న్యూ ఢిల్లీ-న్యూయార్క్ బిజినెస్ క్లాస్ రౌండ్-ట్రిప్ టిక్కెట్‌ను ఏడు సార్లు కొనుగోలు చేయవచ్చు. పైగా ఇవి 150 రాత్రులు హోటల్లో బస చేసేందుకు సరిపోతుంది.

భారీగా డబ్బును ఆదాచేసేందుకు మార్కెట్లో ఉన్న సాధనాల్లో క్రెడిట్ కార్డ్‌లు శక్తివంతమైన, అత్యుత్తమ ఆర్థిక సాధనం. అందువల్ల మీ అవసరాలకు సరిపోయే వివిధ రకాల కార్డుల్లో బెస్ట్ కార్డ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన కార్డును ఎంచునేటప్పుడు 5 కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ముందుగా ఏదైనా క్రెడిట్ కార్డును ఎంచుకోవటానికి ముందు దానికి సంబంధించిన షరతులను పూర్తిగా తెలుసుకోవాలి. కార్డుకు సంబంధించిన రివార్డులు, ప్రయోజనాలు అంటే విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సిస్, సినిమా తగ్గింపులు, గోల్ఫ్ కోర్సు యాక్సెస్, డైనింగ్ పెర్క్‌లు వంటి మరిన్ని ప్రయోజనాలను పరిగణించాలనుకోవచ్చు. రెండవది మీరు క్యాష్ బ్యాక్ కోరుకుంటున్నట్లయితే తప్పకుండా.. క్యాష్‌బ్యాక్ అందించే కార్డ్‌ని ఎంచుకోవాలి. లేదా మీ అవసరాలకు అనుగుణంగా ఎయిర్ మైల్స్, రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకునే ఎంపికలు ఉన్న కార్డులను ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

క్రెడిట్ కార్డు విషయంలో గుర్తించాల్సిన మూడో ముఖ్య విషయం ఏమిటంటే.. ఎంత శాతాన్ని రివార్డుగా అదిస్తున్నారన్నదే. కొన్ని కార్డులు అన్ని రకాల ఖర్చులకు రివార్డులను అందించకపోవచ్చు ఇలాంటి విషయాలను కార్డు తీసుకోవటానికి ముందుగా పరిశోధన చేయటం ఉత్తమం. రివార్డ్ సిస్టమ్‌తో పాటు గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ స్టోర్ డీల్‌ల లభ్యత. కొన్ని కార్డులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కొనుగోళ్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు లేదా క్యాష్‌బ్యాక్ డీల్‌లను అందించవచ్చు. ఇవి వివిధ కంపెనీని బట్టి మారిపోతుంటాయి.

చివరగా కార్డు తీసుకోవాలనుకునే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం కార్డు ఛార్జీల గురించే. మన అవసరాలకు అనుగుణంగా కార్డులను ఎంపిక చేసుకోవటం మంచిది.. మీ స్నేహితుడో, బంధువులో కలిగి ఉన్న కార్డులను గుడ్డిగా తీసుకోవటం మంచిది కాదు. మీకు అవసరమైన అత్యధిక ప్రయోజనాలు, రివార్డులను అందించే తక్కువ యాన్యువల్ ఛార్జీలు ఉండే కార్డులను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. చాలా కంపెనీలు వారు నిర్థేశించిన వార్షిక మెుత్తాన్ని కార్డు ద్వారా ఖర్చు చేస్తే సదరు కార్డుకు ఉండే వార్షిక రుసుములను వసూలు చేయవు. కాబట్టి ఇలాంటి విషయాలను తనిఖీ చేసుకుని తదనుగుణంగా కార్డును ఎంపిక చేసుకుని డబ్బును భారీగా ఆదా చేసుకోండి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications