Rakesh Jhunjhunwala: భారతదేశపు దిగ్గజ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా. 62 ఏళ్ల వయస్సులో మరణించిన ఆయన జయంతి నేడు. 1980లలో కేవలం రూ.5000 పెట్టుబడితో స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించి రూ.35,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.
బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై ఇటీవల వచ్చిన 'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్‌జున్‌వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. సక్సెస్ ఫుల్ స్టాక్ పికింగ్ కోసం పాటించిన సూత్రాలను చూద్దాం..

ముందుగా ప్రతి ఒక్కరూ తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను తప్పక జున్‌జున్‌వాలా పరిశీలించేవారు. చుట్టుపక్కల ఉండే టెక్నాలజీలను ప్రజలు ఎలా వినియోగిస్తున్నారో గమనించటం, సర్వీసులు, ఉత్పత్తుల తయారీదారులను గమనిస్తే మంచి స్టాక్ పెట్టుబడి ఆలోచనలు వస్తాయని భావిస్తుంటారు. రెండవది మార్కెట్ పరిమాణం పెరిగేకొద్దీ కంపెనీ ఎంత పెద్ద అవకాశాన్ని చూస్తుందో అంచనా వేయాలి. ఇదే సమయంలో మార్కెట్ పరిణామాలతో కలిసి కదలటం వల్ల వృద్ధికి సుదీర్ఘ రన్‌వే లభిస్తుంది. పెద్ద మార్పు లేదా మలుపు మాత్రమే గొప్ప సంపదను సృష్టిస్తుందని రాకేష్ అనేవారు.
అలాగే కంపెనీని ఎంపిక చేసుకునేటప్పుడు దాని కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉందనేది తప్పక గమనించాల్సిన అంశం. కష్టపడి పనిచేసే, నిజాయితీతో కూడిన నిర్వహణ ముఖ్యం. ఇలాంటి అంశాలను అధ్యయనం చేయటం, వారిపై సరైన సమయంలో బెట్టింగ్ చేయటంతో రాకేష్ మంచి లాభాలను ఆర్జించారు. టాటా గ్రూప్ స్టాక్స్ పెట్టుబడి ఎంపిక ఇందుకు మంచి ఉదాహరణ. మరో ముఖ్యమైన అంశం కంపెనీ పోటీ పరంగా ముందంజలో ఉండటం. ఇందుకు దాని బ్రాండ్, సాంకేతికత లేదా ఇతర కారణాలు ఉండవచ్చు.

చివరగా షేర్లను ఏ వాల్యుయేషన్ల వద్ద కొంటున్నారనే విషయం శ్రద్ధ చూపాల్సిన విషయం. దీనిపైనే పొందే రాబడులు ఆధారపడి ఉంటాయి. అలాగే పెట్టుబడులపై నిరంతర పర్యవేక్షణ కూడా అవసరం, మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులు అయినప్పటికీ కాలానుగుణంగా పోర్ట్ ఫోలియో పనితీరును పర్యవేక్షిస్తూనే ఉండాలి.


Click it and Unblock the Notifications