Stock Market: ఈవారం మార్కెట్లు పరిస్థితి ఏంటి..? ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయాలివే..
Market Next Week: గడచిన వారంలో భారత స్టాక్ మార్కెట్లు దీపావళి కారణంగా ముహురత్ ట్రేడింగ్ చూశాయి. ఈ క్రమంలో మార్కెట్లు భారీగా లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా క్రెడిట్ రేటింగ్ ను మూడీస్ తగ్గించటంతో గ్లోబల్ మార్కెట్లు అలజడికి లోనయ్యాయి.
ఇదే క్రమంలో అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కొంత చల్లబటం, మ్యాక్రో ఎకనమిక్ డేటా మెరుగుపడటం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్లను బూస్ట్ చేశాయి. దీంతో సూచీలు దాదాపు ఒకటిన్నర శాతం మేర లాభాన్ని నమోదు చేశాయి. రానున్న వారంలో కూడా మార్కెట్లు లాభాల బాటలోనే కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల చూపు ఎక్కువగా యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలపై ప్రధానంగా ఉందని వారు చెబుతున్నారు.

ఫైనాన్స్ సంస్థల రుణాల విషయంలో ఇటీవల రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల షేర్లు వారాంతంలో భారీగానే నష్టాలను చవిచూశాయి. అయితే ఈ ప్రతికూలతను చమురు ధరల తగ్గుదల, యూఎస్ దిగుబడిని నియంత్రించడం ద్వారా మార్కెట్ స్వల్పకాలిక సానుకూల వేగాన్ని కొనసాగించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
ఇదేక్రమంలో దేశంలో ఎన్నికల కోలాహలం కొనసాగుతున్న వేళ మార్కెట్ల స్థిరత్వం ప్రభావితం కావొచ్చని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. అలాగే నవంబర్ 1న ముగిసిన ద్రవ్య విధాన సమావేశం ఫెడ్ మీటింగ్ మినిట్స్ కోసం గ్లోబల్ మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి. అలాగే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ పెట్టుబడుల విక్రయాల స్పీడ్ తగ్గటం సెంటిమెంట్రను కొంత సానుకూలంగా ప్రభావితం చేస్తోంది. ఇదే క్రమంలో మార్కెట్లో లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవోలు మంచి పనితీరును కనబరచటం ప్రస్తుతం పాజిటివ్ ధోరణినికి కారణాలుగా నిలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications