Stock Markets: సెప్టెంబరును దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన రాబడులను చూశాయి. ఈ క్రమంలో గతవారం సూచీలు ప్రతిరోజూ తమ పాత గరిష్ఠాలను దాటుతూ దూసుకుపోయాయి. సెప్టెంబరులో తమ విక్రయాల గణాంకాలను ఆటో కంపెనీలు విడుదల చేయబోతున్నాయి. దీనికి తోడు కంపెనీలు రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను సైతం విడుదల చేస్తాయి. దీనికి తోడు సంస్థాగత ఇన్వెస్టర్ల డేటాపై అందరి చూపు ఉంది.
గత వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత భారతీయ మార్కెట్లు కూడా భారీ బుల్ ర్యాలీని చూశాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలు కార్యకలాపాలు కనబరుస్తుండగా.. మెటల్, పవర్ రంగాలు బలంగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఐటీ, ఎక్స్ పోర్ట్స్ ఆధారిత కంపెనీల షేర్లు కొంత ఒత్తిడిని చూశాయి. అయితే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం యాక్సెంచర్ తన త్రైమాసిక ఫలితాలతో పాటు భవిష్యత్తు వృద్ధిపై కీలక కామెంట్స్ చేసిన తర్వాత దేశీయ టెక్ కంపెనీల షేర్లలో ర్యాలీ ఉండవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో రానున్న వారంలో మార్కెట్లను ప్రభావితం చేసే కీలక అంశాలను కనుగొనే పనిలో ఇన్వెస్టర్లు ఉన్నారు. గడచిన వారం చైనా సెంట్రల్ బ్యాంక్ రేటు తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. చైనా ప్రభుత్వం ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించింది. దీంతో చైనా, హాంకాంగ్ మార్కెట్లలో ర్యాలీ కనిపించగా కమోడిటీ ధరలు పెరిగాయి. అమెరికా మార్కెట్లు కూడా సానుకూల ధోరణిని కనబరుస్తున్నాయి. ఇదే క్రమంలో గడచిన శుక్రవారం క్రూడ్ ఆయిల్ ధరలు తిరిగి పెరుగుదలను చూశాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 71.89 డాలర్లు. ప్రస్తుతం పతనం తర్వాత క్రూడ్ ధరలు తిరిగి పెరుగుదలను చూస్తున్నాయి.
రానున్న వారంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కన్నేసి ఉంచాల్సిన కీలకమైన అంశాల్లో ఎఫ్ఐఐ, డీఐఐ డేటా కూడా కీలకమైనది. సెప్టెంబరులో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.22,403.72 కోట్ల కొనుగోళ్లు చేపట్టగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.24,211.50 కోట్ల విలువైన కొనుగోళ్లు చేపట్టారు. అలాగే కొత్త వారంలో అనేక లిస్టెడ్ కంపెనీలు తమ కార్పొరేట్ యాక్షన్స్ లాస్ట్ డేట్ కలిగి ఉన్నాయి. ADS డయాగ్నోస్టిక్స్, Accelya సొల్యూషన్స్, KPI గ్రీన్ ఎనర్జీలు వాటి ఎక్స్-డివిడెండ్ తేదీలను సెప్టెంబర్ 30న కలిగి ఉన్నాయి. ఇక అనేక కంపెనీలు తమ కంపెనీల లిస్టింగ్ కోసం మార్కెట్లో రెడీ అవుతున్నాయి. మెయిన్ బోర్డ్ విభాగంలో వస్తున్న కొన్ని పెద్ద ఐపీవోలు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి తమ మూలధన అవసరాల కోసం ఏకంగా రూ.60,000 కోట్లను సమీకరించటానికి సిద్ధం అవుతున్నాయి. అలాగే కొత్త ఐపీవోలు కొత్త వారంలో సబ్ స్క్రిప్షన్ ప్రారంభించనున్నాయి.


Click it and Unblock the Notifications