Stock Markets: భారతీయ స్టాక్ మార్కెట్లు 2024 మొదటి ఆరు నెలల కాలంలో రోలర్-కోస్టర్ ప్రయాణంతో దాదాపు సగం సంవత్సరాన్ని చేరుకున్నాయి. జూలైలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ మార్కెట్లలో పెద్ద కదలికను ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో జూన్ చివరి వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల పనితీరు ఎలా ఉంటుందనే ఆందోళన చాలా మందిలో ఇప్పటికే ఉంది. గతవారం స్వల్ప ఒడిదొడుకుల్లో ట్రేడింగ్ కొనసాగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఎలా ఉంటాయనే ఆలోచనలో రిటైల్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేశీయ-అంతర్జాతీయ స్థూల ఆర్థిక సూచికలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ముడి చమురు ధరలు వంటి అంశాలు మార్కెట్లకు దిశా నిర్థేశంగా నిలవనున్నాయి.

యాక్సెంచర్ ఉల్లాసంగా వార్షిక ఆదాయ వృద్ధి సూచనల నేపథ్యంలో ఐటీ స్టాక్స్ లాభపడ్డాయి. బ్రోకరేజ్ సంస్థ స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ ప్రకారం బలమైన కొనుగోలు లేదా అమ్మకాల ట్రిగ్గర్‌లు లేకపోవడంతో వచ్చే వారం మార్కెట్ సైడ్ వేస్‌లో ట్రేడింగ్ కొనసాగించొచ్చని అంచనా వేశారు. అలాగే బడ్జెట్-సంబంధిత సందడి మధ్య సెక్టార్-నిర్దిష్ట కదలికలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బలమైన సంస్థాగత ప్రవాహాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. అయితే రుతుపవనాలు నెమ్మదిగా పురోగమిస్తున్నాయనే ఆందోళనలతో ప్రాఫిట్ బుకింగ్ ఉద్భవించిందని, ఉత్తర భారతదేశంలో వేడిగాలులు కీలక ఆందోళనగా ఉన్నాయని నాయర్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ముంచెత్తనున్న ఐపీవోలు ఇన్వెస్టర్లను ప్రేరేపిస్తాయని తెలుస్తోంది.
ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్న అంశాలను పరిశీలిస్తే.. యూఎస్ క్యూ1 జీడీపీ డేటా, చమురు ధరలు, దేశీయ కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు కార్పొరేట్ యాక్షన్స్, ఎఫ్ఐఐల చర్యలు, విక్స్ సూచీ. రానున్న వారంలో ఐటీ సేవల రంగంలోని కంపెనీలు తిరిగి పుంజుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే టెక్నికల్స్ పరిశీలిస్తే ఈ వారం నిఫ్టీ సూచీ 24000 మార్కును చేరుకోవచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications