Stock Market: వచ్చేవారం మార్కెట్లను తారుమారు చేసే అంశాలివే.. ఇన్వెస్టర్స్ తెలుసుకోండి..
Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగానే నష్టపోయాయి. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న మాంద్యం భయాలు, అధికమైన ద్రవ్యోల్బణం, జూన్ ఉత్పత్తి డేటా, విదేశీ ఇన్వెస్టర్లు సొమ్మును వెనక్కి తీసుకోవటం ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో రానున్న వారం దేశీయ మార్కెట్లు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా వచ్చేవారం మార్కెట్లో అందరి చూపులు రిలయన్స్ ఇండస్ట్రీస్ డీమెర్జిడ్ కంపెనీ అయిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ పైనే ఉంది. దీంతో ఎక్కువ మంది మార్కెట్ పార్టిసిపెంట్లు ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) పై దృష్టి పెడతారు. దీని తర్వాత అందరి చూపులు ఆగస్టు 10న జరిగిన మానిటరీ పాలసీకి సంబంధించిన మీటింగ్ మినిట్స్ విడుదలపైనే ఉంది. అలాగే ఆగస్టు 24-26 మధ్య జరగనున్న జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలసీ సింపోజియంలో ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఉంటుంది. రానున్న పాలసీలో సైతం రేట్ల పెంపు ఉండనున్నట్లు అందరూ భావిస్తున్నారు.

గడచిన మూడు నెలలుగా గణనీయమైన కొనుగోళ్ల తర్వాత ఎఫ్ఐఐలు ఆగస్టులో మాత్రం భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు పాల్పడుతున్నారు. 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్స్ ఈల్డ్ 4.25 శాతానికి చేరుకోవటంతో ఎఫ్ఐఐలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. US డాలర్‌తో పోలిస్తే 83.42 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్న భారతీయ రూపాయి, గతవారం చమురు ధరలు పెరుగుదల కారణంగా ప్రభావితమైంది.
దీనికి తోడు ఆగస్టు 25న విడుదల కానున్న బ్యాంకింగ్ డిపాజిట్లు, రుణాల డేటా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో టెక్నికల్స్ పరిశీలిస్తే.. నిఫ్టీ 19,300 మార్క్ కిందకు పయనిస్తే సైకలాజికల్ 19,000 మార్కు వైపు మరింత దిగజారడానికి కీలకం కావచ్చని, అయితే హర్డిల్ ఎక్కువ వైపు 19,400-19,500గా ఉంటుందని నిపుణులు తెలిపారు.


Click it and Unblock the Notifications