Stock Market: రెండు వారాలు క్షీణించిన మార్కెట్లు.. వచ్చేవారం పరిస్థితి ఏంటి..??
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు వారాలు నష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా భారత మార్కెట్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
గడచిన రెండు వారాల మార్కెట్లను పరిశీలిస్తే.. దలాల్ స్టీట్ పై బేర్స్ తమ పట్టును పెంచుకున్నారు. ప్రధాన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలటంతో వీరు రంగంలోకి దిగారు. ప్రధానంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అంతర్జాతీయంగా మార్కెట్లలో అనిశ్చితులను పెంచేసింది. దీంతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో అమెరికా బాండ్ ఈల్డ్స్ గరిష్ఠాలకు చేరుకోవటం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను మరింతగా ప్రభావితం చేశాయి.

ప్రతికూలతల మధ్య బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 1615 పాయింట్లను కోల్పోగా.. మరో బెంచ్ మార్క్ సూసీ నిఫ్టీ 495 పాయింట్లను గతవారం కోల్పోయింది. అయితే వారాంతంలో భారత మార్కెట్ సూచీలు రికవరీని నమోదు చేసి భారీగా లాభాలతో ప్రయాణాన్ని ముగించటం ఇన్వెస్టర్లలో కొంత ఊరటను కలిగించింది. అయితే మెుత్తానికి అన్ని బెంచ్ మార్క్ సూచీలు గతవారం నష్టాలనే ఇన్వెస్టర్లకు మిగిల్చాయి. నిఫ్టీ 50లో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా షేర్లు మాత్రమే టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇక వచ్చే వారం ఇన్వెస్టర్లు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మారుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్, ఎఫ్ఐఐల విక్రయాలు, అమెరికా క్యూ3 కార్పొరేట్ ఫలితాలు, కొనసాగుతున్న మార్కెట్ల కన్సాలిడేషన్ చాలా కీలకంగా వ్యవహరించనున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదంపై గ్లోబల్ మార్కెట్ దృష్టి సారించినందున గ్లోబల్ రికవరీ ఆలస్యం అవుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
చైనా యొక్క తయారీ, నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ PMI, యూరోజోన్ ద్రవ్యోల్బణం GDP డేటా వంటి డేటా కీలకంగా మారనుంది. దీనికి తోడు ముడి చమురు నిల్వలు, యూకే తయారీ పీఎంఐ, అమెరికా తయారీ సేవల పీఎంఐ, నిరుద్యోగ భత్యం, వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగ రేటు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు వంటి అంశాలు చాలా కీలకమైనవిగా మారనున్నాయి. ఇన్వెస్టర్లు వీటి డేటా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications