Stock Market: ఈవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే.. ట్రేడర్స్ ఓలుక్కేయండి..
Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. గత వారం దాదాపు 3 శాతం మేర ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ మదుపరులు పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకున్నారు.
ఈ క్రమంలో ప్రధానంగా గ్లోబల్ ట్రెండ్స్, విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్, భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు వంటి అంశాలు ఈ వారం మార్కెట్లకు చాలా కీలకంగా మారనున్నాయి. అలాగే గురువారంతో నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లు ఎక్కువ ఓలటాలిటీని నమోదు చేయవచ్చని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు.

ఇదే క్రమంలో పెరుగుతున్న ముడి చమురు ధరలు, US డాలర్ ఇండెక్స్, ట్రెజరీ దిగుబడులు, నిరంతర ఎఫ్‌ఐఐ అమ్మకాల వంటి ఆందోళనలు మార్కెట్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథవాలే వెల్లడించారు. యూఎస్ ఫెడ్ భవిష్యత్ వడ్డీ రేట్ల పెంపుకు సంకేతాలు ఇవ్వటంతో సంపద ఈక్విటీల నుంచి బాండ్ మార్కెట్లకు తరలిపోతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా పతనమౌతున్నాయని వారు చెబుతున్నారు. పైగా చాలా కాలం ర్యాలీ తర్వాత మార్కెట్లలో లాభాల స్వీకరణ కూడా కొనసాగుతోందని అంటున్నారు.
ఈ క్రమంలో మార్కెట్లు రానున్న వారంలో యూఎస్ జీడీపీ డేటా, యూకే జీడీపీ డేటా, యూరోజోన్ ద్రవ్యోల్బణం వంటి కొన్ని కీలక సంఘటనల ఆధారంగా ముందుకు సాగుతాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా చెప్పారు. దీనికి ముందు శుక్రవారం వరుసగా నాలుగో రోజు కూడా భారత మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. దీంతో గతవారం బెంచ్ మార్క్ సూచీ BSE 1,829.48 పాయింట్లు లేదా 2.69 శాతం క్షీణించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 518.1 పాయింట్లు లేదా 2.56 శాతం నష్టాన్ని నమోదు చేసింది. వీటికి తోడు వచ్చేవారం మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలపై కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications