Stock Markets: గడచిన వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎన్నడూ చూడని బుల్ జోరును కొనసాగించాయి. అయితే ఇప్పుడు అందరి చూపు రానున్న వారం మార్కెట్ల పనితీరుపై పడింది. మార్కెట్లు కుప్పకూలతాయా లేక జోరు కొనసాగుతుందా అనే విషయంపై నిపుణుల సూచలను చాలా మంది పరిశీలిస్తున్నారు.
రానున్న వారంలో దేశీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఫెడ్ స్పీచ్, ఇండియా అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐతో పాటు ఇతర గ్లోబల్ పరిణామాలపై ప్రధానంగా తమ దృష్టిని సారిస్తున్నారు. అలాగే మార్కెట్ల గమనానికి తదుపరి సంకేతాల కోసం గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి-డాలర్ మారకపు విలువపై కూడా పెట్టుబడిదారులు కన్నేశి ఉంచుతారు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో అధిక వ్యాల్యుయేషన్లు ఆందోళనలు కలిగిస్తున్న విషయంగా ఉందని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. ఇది రానున్న వారం మార్కెట్లను అస్థిరతలకు గురిచేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇన్వెస్టర్లు ఇప్పుడు రుతుపవనాల పురోగతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాలను పరిశీలిస్తున్నారు. వీటికి తోడు దేశీయ ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ ఇన్వెస్టర్ల చూపు జూలైలో కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రసంగంపై ఉంది. అలాగే గ్లోబల్ ఫ్రంట్‌లో అమెరికా మార్కెట్‌లో అధిక ప్రాఫిట్ బుకింగ్ కనిపించిందని ప్రవేశ్ గౌర్ వెల్లడించారు. అలాగే జూలై 2న రానున్న అమెరికా అన్ ఎంప్లాయ్మెంట్ డేటా, జూలై 3న విడుదల కానున్న పీఎంఐ డేటా, ఫెడ్ ఎఫ్ఓఎంసీ వివరాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మార్కెట్ ట్రెండ్‌ను కీలకమైన దేశీయ, ప్రపంచ ఆర్థిక డేటా ద్వారా నిర్ణయించబడుతుందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా పేర్కొన్నారు. ఈ కాలంలో HSBC ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ PMI, HSBC ఇండియా సర్వీసెస్ PMI, S&P గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ PMI, ఫెడరల్ రిజర్వ్ చీఫ్ అడ్రస్, US నిరుద్యోగ క్లెయిమ్‌ల డేటా మార్కెట్‌లో ప్రధాన పరిణామాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. సీనియర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ ఖేమ్కా మాత్రం మార్కెట్లలో ఊపు కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే ఇది నిర్థిష్ట షేర్లకు అనుగుణంగా ఉంటుందని సూచించారు. అలాగే ఈ వారంలో విడుదల కానున్న కొన్ని ఎకనామిక్ డేటా కారణంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications