Market This Week: గడచిన వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో వారాంతాన్ని సైతం కీలక బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతోనే ముగించాయి. దీంతో ఇన్వెస్టర్ల చూపు ఈవారం మార్కెట్ల పనితీరు ఎలా ఉంటుందనే దానిపైనే ఉంది.
ఈ వారం ఇన్వెస్టర్లు ప్రధాన కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై దృష్టి పెట్టనున్నారు. దీనికి తోడు దేశంలోని డిపాజిట్ల వృద్ధి రేటు, బ్యాంక్ రుణాల వృద్ధి డేటా, జీడీపీ వృద్ధి రేటు, యూఎస్ ట్రేడ్ బ్యాలెన్స్ వంటి ప్రధాన అంశాలను మార్కెట్లోని ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్నారు.

ఈవారం మార్కెట్లోకి యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, కొఫోర్జీ, కాల్గేట్ పామోలివ్, హావెల్స్ ఇండియా, పిడిలైట్ ఇండస్ట్రీస్, సియట్, డీఎల్ఎఫ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టీసీఎస్ మోటార్స్, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, హిటాచీ ఎనర్జీ, టాటా ఈఎల్ఎక్స్ఐ, బాలకృష్ణా ఇండస్ట్రీస్, మహానగర గ్యాస్, బిర్లా సాఫ్ట్, సయ్యంట్, ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా, టాటా టెక్నాలజీస్ వంటి కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
AI గురించి పెరుగుతున్న ఆశావాదం మధ్య, గతవారంలో అమెరికా మార్కెట్లు పెరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. టెక్నికల్ ఔట్‌లుక్ పరిశీలిస్తే.. అప్‌ట్రెండ్‌ను పునఃప్రారంభించాలంటే 21700 కంటే ఎక్కువ బలమైన బ్రేక్‌అవుట్ అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 21500 దిగువన సపోర్ట్ జోన్ కింద పరిగణించాలన్నారు.


Click it and Unblock the Notifications