Stock Market: వచ్చేవారం మార్కెట్లను నడిపించే కీలక అంశాలివే.. జాగ్రత్త ఇన్వెస్టర్స్..
Stock Market: వరుసగా మూడోవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు కరెక్షన్ కు గురయ్యాయి. రిజర్వు బ్యాంక్ ఇటీవలి ఎంపీసీ సమావేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని చేసిన ప్రకటన కొంత ఆందోళనలకు కారణమైంది. ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుంగాం..
సీపీఐ ద్రవ్యోల్బణం గణాంకాలు ఈవారం విడుదల కానున్నాయి. దేశంలో కూరగాయలు, ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా జూన్ మాసానికి మించి ఉండనున్నట్లు అంచనా వేసింది. అలాగే రానున్న కాలంలో ద్రవ్యోల్బం పెరుగుతుందని వెల్లడించింది. దీనికి తోడు ఫెడ్ మినిట్స్ సైతం మార్కెట్లోకి రానున్నాయి.

ఇదే సమయంలో గ్లోబల్ ఈవెంట్లను గమనిస్తే.. అమెరికా వాహనాల రిటైల్ సేల్స్, చైనా రిటైల్ అండ్ ఇండస్ట్రియల్ అమ్మకాలు, యూరప్ యూకే నెలవారి ద్రవ్యోల్బణ గణాంకాలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అలాగే భారత మార్కెట్లలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎఫ్ఐఐలు నికర అమ్మకం దారులుగా ఉన్నారు. గత వారం వీరు ఏకంగా రూ.4,700 కోట్లను భారత మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుని బయటకు తరలించారు. ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరలు వరసగా ఏడోవారం సైతం పెరుగుదలను నమోదు చేశాయి.
ఇదే క్రమంలో రానున్న వారం కార్పొరేట్ యాక్షన్స్, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఐపీవోలు కీలకంగా వ్యవహరించనున్నాయి. టెక్నికల్స్ పరిగణలోకి తీసుకుంటే నిఫ్టీ మెుదటగా 19,300-19,000 సపర్ట్ పొందుతుందని దీని కిందకు పడిపోతే 18,850-18,900 సపోర్ట్ జోన్ గా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎగువన 19,650-19,700 స్థాయి రెసిస్టెంట్ గా నిలుస్తుందని వారు చెబుతున్నారు. మెుత్తానికి వచ్చే వారం సైతం మార్కెట్లు బేరిష్ ట్రెండ్ కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications