Budget on Taxes: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను రేట్లలో కొన్ని మార్పులు ప్రకటించారు. ఈ క్రమంలో న్యూ టాక్స్ రీజిమ్ కింద స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని గతంలో ఉన్న రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు.
కొత్త పన్ను విధానంలో మారిన శ్లాబ్ రేట్లను పరిశీలిస్తే..
- 0 నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
- రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
- రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
- రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
- రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదాకు అవకాశం.

లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ పెంపు..
అన్ని ఆర్థిక, ఆర్థికేతర ఆస్తులపై వ్యక్తులు పొందే దీర్ఘకాలిక మూలధన లాభాలపై గతంలో ఉన్న 10 శాతం పన్నును ప్రస్తుత బడ్జెట్లో 12.5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే క్రమంలో మూలధన లాభాల కోసం మినహాయింపు పరిమితి సంవత్సరానికి రూ.1.25 లక్షలుగా నిర్ణయించబడుతుంది. ఏడాదికి పైగా ఇన్వెస్టర్లు కలిగి ఉండే లిస్టెడ్ ఆర్థిక ఆస్తులపై దీర్ఘకాలికంగా వర్గీకరించబడతాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
కొత్త పన్ను విధానంలో కుటుంబ పెన్షన్‌పై మినహాయింపును గతంలో ఉన్న రూ.15,000 నుండి రూ.25,000కి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే కొత్త పన్ను విధానంలో మూడు లక్షల ఆదాయం వరకు పన్ను రేటును సున్నాగా ఉండటం దేశంలో దాదాపు 4 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉండనుంది.
ఇదే క్రమంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును గతంలో ఉన్న 15 శాతం నుంచి ప్రస్తుతం 20 శాతానికి పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీల F&Oపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్(STT) 0.02%, 0.1% పెరిగింది.


Click it and Unblock the Notifications