For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

June 1st Rules: జూన్ 1 నుంచి జరిగే పెద్ద మార్పులివే.. వెంటనే తెలుసుకోండి..

|

June 1st Changing Rules: మరికొద్ది రోజుల్లో మే నెల పూర్తి కాబోతోంది. ఈ క్రమంలో కొత్త నెల నుంచి మారుతున్న అనేక విషయాలు సామాన్యుల ప్లాన్లను, నెలవారీ బడ్జెట్ ను ఎలా ప్రభావితం చేస్తాయో తప్పక తెలుసుకోవాల్సిందే. అయితే జూన్ నుంచి మారే రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సీఎన్జీ-పీఎన్జీ ధరలు : దేశంలోని చమురు కంపెనీలు ప్రతినెల మెుదటి తేదీన లేదా మెుదటి వారంలో వాహనాల్లో వినియోగించే సీఎన్జీ, గృహాలకు పైప్డ్ గ్యాస్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఢిల్లీ, ముంబైలలో నెల మొదటి వారంలో పెట్రోలియం కంపెనీలు గ్యాస్ ధరను మారుస్తాయి. వీటి ధరలను నిర్ణయించే ఫార్ములాలో చేసిన మార్పుల కారణంగా ఏప్రిల్ నెలలో రేట్లు తగ్గాయి. జూన్‌లో CNG-PNG ధరలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

 june1st

LPG గ్యాస్ సిలిండర్ ధరలు : ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ రేట్లను కంపెనీలు ప్రకటిస్తాయి. ఈ క్రమంలో కమర్షియల్, గృహ వినియోగదారులు రేట్ల మార్పు గురించి తెలుసుకోవటం కోసం ఎదురుచూస్తుంటారు. ఏప్రిల్ నెలలో కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. మే నెలలో కూడా తగ్గింపులు ప్రకటించాయి. అయితే గృహ వినియోగదారులు మాత్రం చాలా కాలంగా రేట్ల తగ్గింపు కోసం ఎదురుచూస్తున్నారు.

ఈవీ ధరలు : భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు జూన్ 1, 2023 నుంచి ఖరీదైనవి కానున్నాయి. మే 21న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ FAME-II సబ్సిడీ మొత్తాన్ని kWhకి రూ.10,000కి కుదించింది. గతంలో kWhకి రూ.15,000 తగ్గింపును అందించింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల ధర సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు పెరుగుతుందని వాహన రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary

June 1st Rules: జూన్ 1 నుంచి జరిగే పెద్ద మార్పులివే.. వెంటనే తెలుసుకోండి.. | Know June 1st Changing Rules in 2023 that impact common man pocket and budget

Know June 1st Changing Rules in 2023 that impact common man pocket and budget
Story first published: Friday, May 26, 2023, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X