సినిమా స్టార్ నుంచి డిప్యుటీ సీఎం వరకు Udayanidhi Stalin వ్యాపార ప్రయాణం..!!
Udayanidhi Stalin Assets: నిన్నటి వరకు ఉదయనిధి స్టాలిన్ క్రీడల మంత్రిగా సేవలు అందించిన సంగతి తెలిసిందే. అయితే నేడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. కళాకారుడి కుటుంబ వారసుడు ఉదయనిధి స్టాలిన్ ఆస్తి విలువ ఎంత? అతనికి చెందిన కంపెనీలు ఏమిటి? అతడి వద్ద ఎన్ని లగ్జరీ కార్లు వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
46 ఏళ్ల ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది సినిమాల నుంచే. 2008లో రెడ్ జెయింట్ మూవీస్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. రెడ్ జెయింట్ మూవీస్ ప్రస్తుతం తమిళనాడులో ప్రముఖ చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థగా కొనసాగుతన్న సంగతి తెలిసిందే. సంస్థ ప్రారంభించి దాదాపు 16 ఏళ్లవుతోంది. ఈ సంస్థ ఈ సుదీర్ఘ ప్రయాణంలో చాలా మంది ప్రముఖ నటీనటుల చిత్రాలను నిర్మించి పంపిణీ చేసింది. చిత్ర నిర్మాణంలో నిమగ్నమైన ఉదయనిధి స్టాలిన్ ఆ తర్వాత నటనలోకి కూడా అడుగుపెట్టారు.

ఇక ఉదయనిధి స్టాలిన్ విషయానికొస్తే.. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తనకు రూ.29 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో.. తన వద్ద రూ.75,000 నగదు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్‌గా రూ.53.62 లక్షలు, మ్యూచువల్ ఫండ్‌లో రూ.3.60 లక్షలు, స్టాక్‌మార్కెట్‌లో రూ.6.34 లక్షలు, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో రూ.17.50 లక్షల, రెడ్‌జెయింట్ మూవీస్‌లో రూ.7.36 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని తన నామినేషన్‌లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో తన స్థిరచరాస్తుల గురించి వెల్లడిస్తూ వ్యవసాయ భూమి, ఇంటి విలువ రూ.6.54 కోట్లుగా పేర్కొన్నారు.
ఇదే క్రమంలో తన వద్ద రూ.1,77,63,736 విలువైన రేంజ్ రోవర్ కారు ఉందని పేర్కొన్నాడు. గతంలో హమ్మర్ కారు కొనుగోలు చేసి వివాదంలో చిక్కుకున్నారు ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాల్ రెడ్ జెయింట్ మూవీస్ మాత్రమే కాకుండా స్నో హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్నో స్పోర్ట్స్ ప్రమోషన్ లిమిటెడ్ వంటి అన్‌లిస్టెడ్ కంపెనీలకు కూడా బోర్డు మెంబర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ 1977 నవంబర్ 27న చెన్నైలో జన్మించారు. డాన్ పాస్కో స్కూల్‌లో తన చదువును పూర్తి చేసిన తర్వాత, అతను 1997లో చెన్నైలోని లయోలా కాలేజీలో తన BSE విజువల్ కమ్యూనికేషన్ కోర్సును పూర్తి చేశారు. ఆ తర్వాత 2002లో కృతికను పెళ్లాడాడు. హలో చెన్నై, కాళి చిత్రాలకు ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరించాడు.


Click it and Unblock the Notifications