IPO News: కొత్తవారంలో 2 కొత్త ఐపీవోలు స్టార్ట్.. 6 లిస్టింగులు, పూర్తి వివరాలు ఇవే..

Upcoming IPOs: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గతవారం భారీగా పతనాన్ని చూసినప్పటికీ.. ఐపీవో మార్కెట్లో మాత్రం ఆ క్రేజ్ కొనసాగింది. గతవారం మార్కెట్ల క్షీణత సమయంలోనూ వచ్చిన ఐపీవోలు బంపర్ లిస్టింగ్ లాభాలను ఇన్వెస్టర్లకు అందించాయి. దీంతో ఈవారం కూడా కొనసాగనున్న ఐపీవోల రద్దీ మార్కెట్లో తమ అదృష్టం పరీక్షించుకోవటానికి అనేక మంది ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మెయిన్ బోర్డ్ నుంచి ఎస్ఎమ్ఈ కేటిగిరీలో వస్తున్న ఐపీవోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది ఐపీవోల ద్వారా కంపెనీలు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి తమ మూలధన అవసరాల కోసం ఏకంగా రూ.1.5 లక్షల కోట్లను సమీకరించనున్నాయి. వృద్ధి దశలో ఉన్న కంపెనీలు తమ అవసరాల కోసం మార్కెట్లో ఐపీవోలను ఫ్లోట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు సైతం ఇండియన్ మార్కెట్లపై దృష్టిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే వారం సబ్‌స్క్రిప్షన్ కోసం తెరిచి ఉండే IPOల జాబితా పరిశీలిస్తే..

Know IPOs that are listing and opening for subscription next week

- Garuda Construction and Engineering IPO సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 8-10 వరకు అందుబాటులో ఉండనుంది. ఐపీవో మార్కెట్ల నుంచి రూ.264.10 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇందులో దాదాపు రూ.90 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉంది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.92-95గా నిర్ణయించింది.

- Shiv Texchem IPO అక్టోబర్ 8 నుంచి 10 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. కంపెనీ మార్కెట్ల నుంచి రూ.101.35 కోట్లను సమీకరించే లక్ష్యంతో దీనిని ప్రారంభించింది. ఈ క్రమంలో పూర్తిగా 61.06 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచుతోంది. శివ్ టెక్స్‌కెమ్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.158-166గా సెచ్ చేసింది. ప్రస్తుత ఐపీవోకు వివ్రో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.

- Khyati Global Ventures IPO అక్టోబరు 4, 2024న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడి అక్టోబర్ 8, 2024న ముగుస్తుంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న తాజా ఐపీవోలో కంపెనీ రూ.18.30 కోట్లను సమీకరిస్తోంది. కంపెనీ తాజాగా ఇష్యూ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.99గా ఉంచింది. ఆర్యమాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ ఆఫర్‌కు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.

ఈవారం మార్కెట్లోకి వస్తున్న కొత్త లిస్టింగ్స్ ఇవే..

HVAX Technologies IPO: HVAX టెక్నాలజీస్ ఐపీవో కోసం కేటాయింపు అక్టోబర్ 3, గురువారం నాడు పూర్తయింది. దీంతో కంపెనీ షేర్లు అక్టోబర్ 7న NSE SMEలో లిస్టింగ్ అవ్వనుంది.

Saj Hotels IPO: సజ్ హోటల్స్ ఐపీవో కోసం కేటాయింపు అక్టోబర్ 3, గురువారం నాడు పూర్తయింది. ఈ ఐపీవో అక్టోబర్ 7న NSE SMEలో జాబితా కోసం రాబోతోంది.

Subam Papers IPO: శుభం పేపర్స్ ఐపీవో కోసం కేటాయింపు అక్టోబర్ 4, శుక్రవారం నాడు పూర్తయింది. కంపెనీ షేర్లు బీఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో అక్టోబర్ 8న రాబోతున్నట్లు తెలుస్తోంది.

Paramount Dye Tec IPO: పారామౌంట్ డై టెక్ ఐపీవో కోసం కేటాయింపు అక్టోబర్ 4, శుక్రవారం నాడు పూర్తయింది. ఐపీవో NSE SMEలో అక్టోబర్ 8న జాబితాకానున్నట్లు తెలుస్తోంది.

NeoPolitan Pizza and Foods IPO: నియోపాలిటన్ పిజ్జా అండ్ ఫుడ్స్ ఐపీవో కోసం కేటాయింపు అక్టోబర్ 7, సోమవారం పూర్తవుతుందని తెలుస్తోంది. ఐపీవో BSE SMEలో అక్టోబర్ 9న జాబితా చేయబడుతుంది.

Khyati Global Ventures IPO: ఖ్యాతి గ్లోబల్ వెంచర్స్ ఐపీవో కోసం కేటాయింపు అక్టోబర్ 9న పూర్తవుతుందని అంచనా వేయబడింది. ఖ్యాతి గ్లోబల్ వెంచర్స్ ఐపీవో అక్టోబర్ 11న BSE SMEలో జాబితా చేయబడుతుందని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+