Investment Planning: భారతదేశంలో కొత్త పెట్టుబడిదారులు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతుండగా.. పదేళ్లకు పైగా అనుభవం ఉన్న ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్, బంగారం, ఈక్విటీ వంటి వివిధ పెట్టుబడి మార్గాలను ప్రాధాన్యతనిస్తారని StockGro, 1Lattice సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఈ అధ్యయనంలో అనుభవంతో పెట్టుబడి ప్రాధాన్యతలు ఎలా మారుతున్నాయో విశ్లేషణ జరిగింది. ఒక సంవత్సరం లోపు అనుభవం ఉన్న కొత్త పెట్టుబడిదారులు తమ నిధుల్లో దాదాపు 48 శాతం మ్యూచువల్ ఫండ్స్‌కు, 31 శాతం స్టాక్స్‌కు కేటాయిస్తున్నట్లు తేలింది. వారు కేవలం 13 శాతం బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు, 6 శాతం మాత్రమే రియల్ ఎస్టేట్‌కు మెుత్తం పెట్టుబడిలో కేటాయిస్తున్నట్లు గుర్తించబడింది.

ఇదే సమయంలో 10 ఏళ్లకుపైగా అనుభవం కలిగిన పెట్టుబడిదారులు భిన్నమైన వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. వారు మ్యూచువల్ ఫండ్స్‌లో 25 శాతం మాత్రమే పెట్టుబడి పెట్టి, రియల్ ఎస్టేట్ లో 17 శాతం.. బంగారం, వెండిలో 18 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తేలింది. దీని ప్రకారం అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు స్థిరమైన ఆస్తులను ఇష్టపడుతుండగా.. కొత్త పెట్టుబడిదారులు అధిక రిస్క్, అధిక రాబడికి ఉండే పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తున్నారని స్పష్టమైంది.
స్టాక్స్ పై పెరుగుతున్న ఆసక్తి..
స్టాక్స్‌పై పెరుగుతున్న ఆసక్తి దేశంలో డీమాట్ ఖాతాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలతో ప్రతిబింబితమవుతోంది. కరోనా తర్వాత డీమాట్ ఖాతాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. మార్చి 2019లో 3.6 కోట్లుగా ఉన్న వీటి సంఖ్య నవంబర్ 2021 నాటికి 7.7 కోట్లకు చేరుకుంది. ఈ ఖాతాల్లో ఎక్కువ భాగం 30 ఏళ్లలోపు ఉన్న కొత్త పెట్టుబడిదారులకు చెందినవేనని నివేదిక వెల్లడించింది. ఇది ఈక్విటీలపై పెరుగుతున్న ఆకలిని సూచిస్తోంది. అలాగే ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ట్రేడింగ్ FY19-FY21 మధ్య 500 శాతం పెరుగుదలను చూసింది. అయితే వీరిలో 90 శాతం మంది ట్రేడర్లు నష్టాలను నమోదు చేయడం ఆందోళనకు దారితీస్తోంది.
42 శాతం మంది పెట్టుబడిదారులు దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెడుతుండగా, 32 శాతం మంది నిష్క్రియాత్మక ఆదాయాన్ని కోరుకుంటున్నారు. 20 శాతం మంది నైపుణ్యాభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టగా, 6 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్వే చేసిన పెట్టుబడిదారుల్లో 81 శాతం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టారని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 35 ఏళ్లలోపు పెట్టుబడిదారులలో 45 శాతం మంది స్టాక్స్‌ను తమ ప్రాథమిక పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. ఇది సాంప్రదాయ పెట్టుబడి విధానాల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల వైపు మారిన తీరును ప్రతిబింబిస్తోంది.


Click it and Unblock the Notifications