IPL 2025: ఐపీవో వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం.. నీతా అంబానీ చేసిన పని వైరల్..
IPL Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1574 మంది రిజిస్టర్ చేసుకోగా.. బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఈ ఆటగాళ్లు పోటీపడనున్నారు. పాల్గొంటున్న వారిలో 366 మంది భారత ఆటగాళ్లు మిగిలిన 208 మంది ఓవర్‌సీస్ క్రికెటర్లు ఉన్నారు.
నేడు స్టార్ట్ అయిన మెగా ఐపీవో 2025 వేలం పాటలో ఈసారి భారత్‌కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 12 మంది అన్‌క్యాప్‌డ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం 70 ఓవర్‌సీస్ స్లాట్స్ నేడు అందుబాటులో ఉన్నాయి. ఈ మెగా ఐపీఎల్ వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నేడు జరుగుతుండగా.. ఈ క్రమంలో రూ.2 కోట్లు కనీస ధర ఉన్న పేర్ అర్ష్ దీప్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18 కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఈ క్రమంలో తొలుత ఈ ఆటగాడి కోసం చెన్నై, దిల్లీ, గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరబాద్ కూడా పోటీపడ్డాయి. అయితే చివరికి అత్యధిక ధరకు పంజాబ్ టీమ్ ఈ భారతీయ ఆటగాడిని చేజిక్కించుకుంది.

ఇదే క్రమంలో భారీ ధర పలికి రికార్డుల మోత మోగించిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఈ ఆటగాడికి రూ.2 కోట్లు కనీస ధరగా ఉన్నప్పటికీ.. వేలంలో పంజాబ్ కింగ్స్ ఆటగానిపై రూ.26.75 కోట్లతో కాసుల వర్షం కురిపించింది. అలాగే దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడను రూ.10.75 కోట్లకు గుజరాత్ టీం సొంతం చేసుకుంది. ఐపీవో వేలంలో ముంబై టీం యజమాని నీతా అంబానీ చేసిన పని ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. వేలం ప్రక్రియ ప్రారంభానికి ముందు నీతా అంబానీ బిడ్ పేపర్లను తీసుకుని దేవుడికి మెుక్కుతున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నీతా పక్కన కుమారుడు ఆకాష్ అంబానీ కూడా కనిపించారు.
జియో సినిమా..
ఒకపక్క ఐపీఎల్ 2025కి జెడ్డాలో ఆసక్తికరమైన ఆటగాళ్ల వేలంపాట మెుదలుకాగా భారతదేశంలో దీనిని వీక్షిస్తున్న ప్రజలకు జియో సినిమా నిరాశకు గురిచేసింది. యాప్ లో ఏర్పటిన టెక్నికల్ అంతరాయాలు వీక్షకులను, క్రికెట్ లవర్స్ కి చిరాకు కలిగించింది. ఈ క్రమంలో ఊహించని స్ట్రీమింగ్ అంతరాయం వీక్షకులలో ఆందోళనలను రేకెత్తించింది. థ్రిల్లింగ్ వేలం ప్రక్రియను కోల్పోతారనే భయంతో సోషల్ మీడియాలో తాము ఫేస్ చేసిన ఇబ్బంది గురించి యూజర్లు కంప్లెయింట్ చేస్తున్నారు. కొందరు యూజర్లు తమ స్మార్ట్ టీవీలో 8039 ఎర్రర్ కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే సాయంత్రం 3.50 గంటల సమయంలో యాప్ తిరిగి పనిచేయటం ప్రారంభించినట్లు వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications