Home Buyers: దేశంలో రియల్టీ బూమ్ ప్రస్తుతం కొనసాగుతోంది. దేశంలో ప్రాపర్టీల ధరలు సామాన్యులు కొనలేని స్థాయిలకు చేరుకుంటున్న వేళ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా బడ్జెట్ 2024పై ప్రభుత్వం ప్రకటించే ఉపశమనాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి రుణంలో సబ్సిడీ ఇవ్వబడుతుంది. గరిష్టంగా రూ.2.67 లక్షల సబ్సిడీని అందుబాటులో ఉంది. ఇళ్ల ధరలు పెరుగుతున్న వేళ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ మెుత్తాన్ని పెంచాలని చాలా మంది ప్రజలు కోరుతున్నారు. కరోనా తర్వాత ఇల్లు, ఫ్లాట్ కొనడం ఖరీదైనదిగా మారినవేళ ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన సమావేశాల్లో గృహనిర్మాణ రంగానికి సంబంధించిన వ్యక్తులు బడ్జెట్‌లో అదనపు రాయితీలు ఇవ్వాలనే అంశాన్ని లేవనెత్తారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తాజా బడ్జెట్లో ప్రజలకు పెద్ద బహుమతి ఇవ్వగలదని నిపుణులు భావిస్తున్నారు. గత 4 ఏళ్లుగా ప్రాపర్టీ మార్కెట్ నిరంతర అప్‌వర్డ్ ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఫ్లాట్లు, స్థలాల రేట్లు ఏటా 15-20 శాతం పెరుగుతున్నాయి. అఫోర్డబుల్ హౌసింగ్ కింద ప్రస్తుతం రూ.45 లక్షల వరకు ఫ్లాట్లు, ఇళ్లను కొనుగోలు చేయడంలో జీఎస్టీ సంబంధిత రాయితీ అందుబాటులో ఉంది. 45 లక్షల కంటే తక్కువ విలువైన నివాస ప్రాపర్టీకి ఒక శాతం GST వర్తిస్తుంది. సరసమైన నివాస ప్రాపర్టీ పరిధిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. మెట్రో సిటీలో రూ.65 లక్షలు, నాన్ మెట్రో సిటీలో రూ.50 లక్షలు ఉండాలి. దీనికి సంబంధించి ఆర్‌బీఐ సూచనలు కూడా చేసింది. అందువల్ల ఈసారి బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ.65 లక్షలకు పెంచవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు ఉండగా దానిని రూ.2.5 లక్షలకు పెంచాలని డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. అలాగే సెక్షన్ 24బి కింద హౌసింగ్ లోన్‌పై రూ.2 లక్షల రాయితీని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం రూ.3-రూ.4 లక్షలకు రాయితీ మెుత్తాన్ని పెంచొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రాపర్టీ మార్కెట్‌లో పెట్టుబడులను పెంచేందుకు పరిశ్రమ హోదా ఇవ్వాలని, తద్వారా పరిశ్రమల తరహాలో ఈ రంగం కూడా పన్ను మినహాయింపుల ప్రయోజనాన్ని పొందవచ్చని ఆస్తి రంగానికి సంబంధించిన వ్యాపారవేత్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications