Budget 2024: హల్వా వేడుక అంటే ఏమిటి..? దీనిని ఎందుకు నిర్వహిస్తారంటే..
Halwa Ceremony: 17వ లోక్‌సభ చివరి సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
మధ్యంతర బడ్జెట్ లేదా పూర్తి బడ్జెట్ అయినా, బడ్జెట్ సమగ్ర ప్రారంభ సంప్రదాయం "హల్వా వేడుక". ఇది వివిధ బడ్జెట్-సంబంధిత పత్రాల ముద్రణ ప్రక్రియ అధికారిక ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆర్థిక మంత్రి నుంచి అనేక ఇతర అధికారుల వరకు అందరూ దీనిలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనేక నెలలపాటు సాగే విస్తృతమైన బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశల్లో కీలక పాత్ర పోషిస్తుంది. హల్వా వేడుకను సెంట్రల్ దిల్లీలో నిర్వహించటం అనేక దశాబ్ధాలుగా కొనసాగుతోంది.

ఈ వేడుక కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక నివేదికను తయారు చేయడంలో పాల్గొన్న మంత్రిత్వ శాఖలోని అధికారులు, సిబ్బందికి అధికారికంగా పంపడం ప్రాముఖ్యతను కలిగి ఉంది. బడ్జెట్ పత్రం చుట్టూ గోప్యతను కాపాడుకోవడానికి అధికారులందరూ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉంచబడతారు. వారిని సంప్రదించటానికి కూడా ఈ సమయంలో అనుమతి ఉండదు. పైగా మెుబైల్ ఫోన్లు వినియోగానికి కూడా ఎలాంటి అనుమతి లభించదు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాతే సిబ్బందిని నార్త్ బ్లాక్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు.
ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ హయాంలో 1950 కేంద్ర బడ్జెట్ తయారీ సమయంలో సమాచారం లీక్ అయిన నేపథ్యంలో కఠిన పద్దతిని అమలులోకి తీసుకొచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో ముద్రణ ప్రక్రియలో బడ్జెట్‌లో కొంత భాగం లీక్ అయింది. ఆ తర్వాత ప్రింటింగ్ ప్లేస్‌ని మింటో రోడ్‌లోని ప్రభుత్వ ప్రెస్‌కి మార్చారు. 1980 నుంచి దిల్లీలోని సెక్రటేరియట్ భవనంలోని నార్త్ బ్లాక్ బేస్‌మెంట్ బడ్జెట్ ముద్రణ కోసం శాశ్వత ప్రదేశంగా మారింది.


Click it and Unblock the Notifications