Akshaya Tritiya: ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా చాలా మంది భావిస్తుంటారు. ఈ రోజు పిసరంతైనా బంగారం కొంటే మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం. అందుకే చాలా మంది తమ ప్రయాణాన్ని పసిడి కొనుగోలుతో ప్రారంభిస్తారు.
సంస్కృతం ప్రకారం 'అక్షయ' అనే పదానికి "శ్రేయస్సు, ఆశ, ఆనందం, విజయం" అనే అర్థం. అలాగే "ఎప్పటికీ తగ్గదు" అని అర్ధం, అయితే 'తృతీయ' అంటే "చంద్రుని మూడవ దశ". పురాతన కాలం నుంచి భారతీయ గృహాల్లో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని సంపదకు చిహ్నంగా ఆభరణాల రూపంలో అలంకరించుకోవటం సాంప్రదాయంగా వస్తోంది. పెట్టుబడి పరంగా దీనికి ఉన్న ఐదు ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

- ముందుగా బంగారానికి ఉన్న అత్యుత్తమ సౌలభ్యం లిక్విడిటీ. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా కరెన్సీతో పనిలేకుండా విక్రయిస్తే డబ్బు వచ్చే ఏకైక సాధనం బంగారం. భౌతికంగా బంగారం మనవద్ద ఉన్నట్లయితే.. జేబులో డబ్బు ఉన్నట్లే లెక్క. అలాగే డిజిటల్ రూపంలో పెట్టుబడులు ఉన్నట్లయితే వాటిని సులవుగా రిడీమ్ చేసుకోవచ్చు. ఆర్థిక సంక్షోభాల సమయంలో చాలా మంది ఆశ్రయించే ఏకైక సాధనంగా బంగారం గుర్తింపు తెచ్చుకుంది.
- ఒత్తిడితో కూడిన ఆర్థిక సమయాల్లో సిస్టమ్యాటిక్ రిస్క్ ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. రిస్క్ పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకునేందుకు హెడ్జ్ చేసుకోవటానికి బంగారం ఒక పెట్టుబడి సాధనం. అందుకే దీనిని సురక్షితమైన పెట్టుబడి స్వర్గధామమని అంటారు.
- బంగారం వ్యక్తి జీవన వ్యయం పెరుగుదలతో పాటు పెరిగే ధోరణిని కలిగి ఉంటుంది. ఇది నగదు నిల్వలుగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి బంగారం హోర్డింగ్‌ను పెంచటం, తగ్గించటం చేస్తుంటాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్న సమయంలో పసిడి మెరుగైన పనితీరు కనబరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

-ఈక్విటీలతో పోల్చుకుంటే బంగారంలో పెట్టుబడుల్లో రిస్క్ తక్కువగా ఉంటుంది. మీరు డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే అసెట్, కౌంటర్‌పార్టీ రిస్క్‌ను ప్రభావితం చేయడం వంటి మరిన్ని నష్టాలు ఉన్నాయి. అయితే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే కాలక్రమేణా బంగారం ధర క్షీణించదు. అలాగే రూపాయి విలువ క్షీణించినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది.
- చివరిగా ఇన్వెస్టర్లు తమ పోర్ట్ ఫోలియోలో బంగారానికి సముచిత స్థానాన్ని ఇవ్వటం ద్వారా మంచి కుషన్ అందిస్తుంది. మార్కెట్లు కుప్పకూలినప్పుడు లేదా ఒలటాలిటీలో అనిశ్చితులను ఎదుర్కొంటే నష్టాలను తగ్గించేందుకు డైవర్సిఫికేషన్ అందిస్తుంది. ఇది పెట్టుబడిదారులు అన్ని సమయాల్లో మంచి రాబడిని పొందేందుకు వీలు కల్పిస్తుంది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications