Crude Oil: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పెరుగుతున్న చమురు ధరలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. బ్రెంట్ ఆయిల్ దాదాపు 10 డాలర్ల మేర ధరలు పెరగటంతో క్రూడ్ ధరలు 10 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి.
అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు భారతదేశానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇంత భారీగా చమురు ధరలు పెరగటం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 0.5 శాతం పెరగటానికి కారణమవటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. రవాణా ఖర్చులను పెంచి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గకుండా చేస్తుందని వారు చెబుతున్నారు. ఇదే క్రమంలో చెల్లింపులకు డాలర్లకు మరింత డిమాండ్ భారత రూపాయి మారకపు విలువను ఇది క్షీణింపజేస్తుందని ఆందోళనలు పెరుగుతున్నాయి.

అధికంగా ఉన్న చమురు ధరలు భారత బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ.. భారత వృద్ధిని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో దేశంలోని ఆయిల్ తయారీ సంస్థలను పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించొచ్చని తెలుస్తోంది. గత ఏడాది దేశీయ చమురు కంపెనీలు బ్యారెల్ 140 డాలర్లకు కొనుగోలు చేసి తక్కువ రేట్లకు విక్రయించటం వల్ల భారీ నష్టాలు మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ధరల సెగ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారకుండా ఉండేందుకు రేట్ల పెంపును తాత్కాలికంగా మోదీ సర్కార్ వాయిదా వేయెుచ్చని తెలుస్తోంది.
ప్రధానంగా సౌదీ, రష్యాలు తమ రోజువారీ చమురు ఉత్పత్తిని తగ్గించటంతో పాటు చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవటంతో సప్లై డిమాండ్ మధ్య వ్యత్యాసం ఏర్పడింది. దీంతో క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర త్వరలోనే 100 డాలర్లను దాటుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ భారత ప్రభుత్వం ఈ పెంపును ప్రజలకు బదిలీ చేస్తే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వారి జేబులు గుల్లవక తప్పదు. ఇప్పటికే సెంటరీ దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులపై భారాన్ని మరింతగా పెంచుతాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications