Notes Ban: దేశంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నాడు రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా సర్క్యూలర్ ప్రకారం రూ.2000 నోట్లు కలిగి ఉన్న వ్యక్తులు సెప్టెంబరు 30 లోగా వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంక్ డేటా ప్రకారం మార్చి 31,2018 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇది మొత్తం విడుదలైన నోట్లలో 37.3 శాతం. అయితే మార్చి 31, 2023 నాటికి రూ.2000 నోట్ల వాటా 10.8 శాతానికి తగ్గింది. పైగా ఇవి చలామణిలో నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి.

గతంలో జరిగిన డీమానిటైజేషన్ కంటే ఇప్పుడు నోట్ల మార్పిడి ప్రక్రియ చాలా సులభతరం అయింది. ఈ క్రమంలో నోట్ల రద్దు నిర్ణయం దేశీయ స్టాక్ మార్కెట్లపై పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిజర్వు బ్యాంక్ తీసుకున్న చర్య వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వారు చెబుతున్నారు. పైగా స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఎక్కువగా ఆన్ లైన్ విధానంలో నడుస్తాయి కాబట్టి ఇన్వెస్టర్లు ఇబ్బందులను ఎదుర్కోరని వారు అంటున్నారు.
ఇదే క్రమంలో సామాన్య ప్రజలు సైతం నగదు లావాదేవీలు, చెల్లింపులకు ఎక్కువగా డిజిటల్ చెల్లింపు మార్గాలను వినియోగించటం వల్ల రూ.2000 నోట్ల రద్దు ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రజలు సాధారణంగా ఆన్‌లైన్ చెల్లింపు సౌకర్యాలను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. దీనివల్ల 2016లో డీమోనిటైజేషన్ లాంటి ప్రభావం ఉండకూడదని స్టాక్ మార్కెట్ ఇండిపెండెంట్ మార్కెట్ విశ్లేషకుడు అంబరీష్ బలిగా అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై తాజా నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బథిని పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications