Tax Rules: ఇంట్లో ఎంత లిక్విడ్ క్యాష్ ఉంచుకోవచ్చు..?? పన్ను చట్టాలు ఏమంటున్నాయంటే..
Liquid Cash: నోట్ల రద్దు తర్వాత కొన్ని నెలల తర్వాత ఇటీవల కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన స్థలాల్లో సోదాలు చేయటంతో కట్టలకొద్ది డబ్బు దొరికింది. ఇలా వివిధ సంస్థలు, వ్యాపారులపై చేసిన ఐటీ దాడుల్లో సైతం భారీ మెుత్తాల్లో సొమ్ము దొరకటం వార్తల్లో సర్వ సాధారణంగా వింటూనే ఉన్నాం.
తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుకు చెందిన స్థలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.350 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఎంపీ సాహు మాట్లాడుతూ.. ఈ డబ్బు అంతా తన కుటుంబానికి చెంది మద్యం వ్యాపారం నుంచి వచ్చిందని తెలిపారు. దీనితో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఐటీ అధికారులు లెక్కించి జప్తు చేసిన మొత్తం నా కంపెనీకి చెందినదని అంగీకరించారు.

ఒక వ్యక్తి ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చనే దానిపై ఆదాయపు పన్ను చట్టం నిర్దిష్ట పరిమితులను కలిగి ఉండదు. అయితే సోదాల సమయంలో పన్ను అధికారులు గుర్తించి సీజ్ చేసిన మెుత్తానికి యజమానులు సరైన రుజువులతో వివరణ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ డబ్బు లెక్కల్లో చూపనిదైతే దానిపై చట్టప్రకారం ఐటీ అధికారులు పెనాల్టీ నోటీసులు అందిస్తారు.
పన్ను చట్టాల ప్రకారం అధికారులు డబ్బును జప్తు చేసి 137 శాతం జరిమానా విధించవచ్చు. కాబట్టి ఇంట్లో నగదు ఎక్కువగా ఉన్నవారు తమ వాటికి సంబంధించిన మూలాలను, ఖాతాలను సక్రమంగా ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సహజంగా ప్రజలు ఇంటి నిర్మాణానికి, వైద్య ఖర్చులకు, శుభకార్యాల కోసం ఇంట్లోనే డబ్బును దాచుకుంటుంటారు. అయితే వీటికి సంబంధించిన అన్ని వివరాలను మెయింటెన్ చేసినట్లయితే సోదాల సమయంలో వారి ప్రశ్నలకు సమాదానం మన వద్దే ఉంటుంది. అలాంటప్పుడు చట్టపరమైన సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.


Click it and Unblock the Notifications