Mutual Funds: పెళ్లి ఖర్చుల కోసం అవసరమైన డబ్బు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడబెట్టండిలా..!
Wedding Financing: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెడ్డింగ్ సీజన్ కొనసాగుతోంది. లక్షల మంది కొత్త జంటలు తమ కొత్త జీవితాన్ని ప్రారంభించటం కోసం సిద్ధం అవుతున్నాయి. దీనికి చాలా మంది రానున్న సంవత్సరాల్లో తమ పెళ్లి కోసం ప్లాన్ చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో అందుకోసం ఫైనాన్స్ చేసుకోవటంపై చాలా మంది దృష్టిపెడుతున్నారు.
పెళ్లి కోసం చాలా డబ్బు అవసరం ఉంటుంది. ఇందుకు పెళ్లి మండపం నుంచి క్యాటరింగ్, డెకరేషన్, వస్త్రధారణ ఖర్చులు ప్రధానంగా ఉంటాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా వీటి ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవటం వివాహం ప్లాన్ చేసుకునే వారిపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. అయితే సరైన రీతిలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన మహిళలు తమ పెళ్లి ఖర్చులను నిర్వహించుకోవటానికి చక్కటి పరిష్కారంగా పరిగణించబడుతోంది. భారతీయ వివాహ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్దదని, దీని విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉందని ఉమెన్ ఆన్ వెల్త్ సహ-వ్యవస్థాపకురాలు ప్రియాంక భాటియా పేర్కొన్నారు. సగటు భారతీయ మధ్యతరగతి కుటుంబం దీనికోసం రూ.25-40 లక్షల వరకు ఖర్చు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇక డబ్బున్నోళ్ల ఖర్చు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు.

ప్రజలు సరైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను రాజీ పడకుండానే కలల వివాహాన్ని పూర్తి చేయవచ్చని ప్రియాంక చెప్పారు. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్ సరైన మార్గంగా పేర్కొన్నారు. దీనిని నెలకు రూ.10,000 సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా సాధించవచ్చు. ఐదేళ్ల కాలానికి 12 శాతం రాబడితో ఇలా చేయటం వల్ల రూ.8 లక్షలు పోగుచేయవచ్చు. ప్రజలు వారి రిస్క్ అపటైట్ కి అనుగుణంగా ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ మధ్య స్కీమ్స్ ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
ముందుగా మహిళలు ఒక రియలిస్టింక్ వివాహ బడ్జెట్‌ను సెట్ చేయాలి. ద్రవ్యోల్బణం, ఖర్చులను వేదిక బుకింగ్‌లు లేదా వస్త్రధారణ వంటి చిన్న లక్ష్యాలుగా విభజించాలి. పెళ్లికి 5 ఏళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నట్లయితే ఈక్విటీ ఫండ్స్ ఎంచుకోవటం ఉత్తమంగా పేర్కొనబడింది. పోర్ట్‌ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించడం, సర్దుబాటు చేయడం ద్వారా ఫండ్ వివాహ లక్ష్యాలతో సమలేఖనం చేయబడిందని నిర్ధారిస్తుంది. తేదీ సమీపిస్తున్న కొద్దీ సురక్షితమైన పెట్టుబడులను అనుమతిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌తో, మహిళలు నమ్మకంగా తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తూ, డ్రీమ్ మ్యారేజ్ పూర్తి చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ వివాహ ప్రణాళిక కోసం ఒక గొప్ప సాధనం. అయితే వారి ప్రయోజనాలను పెంచుకోవడానికి అవి ఎలా పని చేస్తాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక అక్షరాస్యత అనేది వివాహాలు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత వంటి తక్షణ లక్ష్యాలకు మద్దతునిస్తూ, సమాచారంతో కూడిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో వ్యక్తులకు సహాయపడుతుంది. పెట్టుబడిదారులు దీనికోసం ముందుగా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడుల గురించి అర్థం చేసుకోవటానికి సంపద సృష్టిపై అవగాహన కల్పించే ఆన్‌లైన్ కోర్సులను అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. తద్వారా వ్యక్తులు సరైన పెట్టుబడి ఎంపికలను సెలెక్ట్ చేసుకోవటానికి అవసరమైన జ్ఞానాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications