Gold Price: అటు పసిడి ప్రియులు, ఇటు బంగారం వ్యాపారస్తులు ఎంతగానో ఎదురుచూసిన అక్షయ తృతీయ నిన్న పూర్తైంది. అయితే ఈ సారి పండుగ అమ్మకాల్లో కొత్త ధోరణి కనిపించింది. వ్యాపారులు దీని గురించి ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
గత సంవత్సరం అక్షయ తృతీయ సమయంలో 10 గ్రాముల 24 కారెట్ల బంగారం ధర రూ.50,800గా ఉంది. అయితే ఏప్రిల్ 23, 2023 అక్షయ తృతీయ సమయంలో ఇది రూ.62,090 వద్ద ఉంది. బంగారం ధరలు భారీగా పెరిగిన తరుణంలో పండుగ రోజున ఆభరణాల విక్రయాలు మందగించాయని వ్యాపారులు తెలిపారు. గిరాకీ తగ్గటంతో పాటు కస్టమర్లు ఎక్కువగా ఈ సారి 1 లేదా 2 గ్రాముల బంగారు నాణాలను కొనుగోలు చేసినట్లు నగల వ్యాపారులు తెలిపారు.

ప్రధానంగా దక్షిణాది ప్రాంతాల్లో విక్రయాలు కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ చాలా మంది పసిడి ప్రియులు 10 గ్రాముల కంటే తక్కువ ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ సాయం మెహ్రా తెలిపారు. ఇదే సమయంలో చాలా మంది కస్టమర్లు బంగారం ధరలు అధికంగా ఉన్నందున తమ పాత బంగారాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకుని దానికి బదులుగా కొత్త బంగారాన్ని కొనుగోలు చేసినట్లు గోల్డ్ షాప్ యజమానులు వెల్లడించారు.
పండుగ తర్వాత ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 మేర తగ్గింది. దీంతో చెన్నైలో రూ.61,150, ముంబైలో రూ.60,820, దిల్లీలో రూ.60,970, కోల్‌కత్తాలో రూ.60,820, బెంగళూరులో రూ.60,870, కేరళలో రూ.60,820, కోయంబత్తూరులో రూ.61,150, సూరత్ లో రూ.60,870, నోయిడాలో రూ.60,970గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,820గా ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్, కడప, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమరావతి నగరాల్లో పసిడి ధర రూ.60,820 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశంలో వెండి ధర నిన్నటితో పోల్చితే కేజీకి రూ.700 తగ్గి నేడు రూ.76,900 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications