Investment: కొంత కాలంగా దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో చాలా మంది తమ ఆర్థిక ప్రణాళికల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
రానున్న కాలంలో పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత విద్యకు నిధులు, వృద్ధాప్యం వరకు అన్నింటికీ ముందుగానే ఆర్థిక ప్రణాళిక వేసుకుంటున్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా బాధ్యతలను నిర్వర్తించాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ప్రతి నెల రూ.5,000 పెట్టుబడితో పిల్లలకు 20 ఏళ్లు వచ్చేసరికి రూ.50 లక్షలు ఎలా సమీకరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ పెట్టుబడి విధానం చాలా ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్‌లో డబ్బును పెట్టుబడి పెట్టండి. ఇది మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున స్థిర వడ్డీ రేటు రాబడికి హామీ ఇవ్వబడదు. అయితే నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయటం కంటే ఎస్ఐపీ రూపంలో పెట్టుబడులు పెట్టడం తక్కువ రిస్క్ కలిగి ఉంటుంది. అలాగే ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని, సంపదను నిర్మిస్తుందని నిపుణులు చెబుతుంటారు. దీనిద్వారా ఇన్వెస్టర్లు చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పెట్టుబడి విధానంలో సగటున 12 శాతం నుంచి ఎక్కువ రాబడిని కూడా పొందవచ్చు.
మీకు పిల్లలు పుట్టగానే వారి పేరుమీద ప్రతినెల రూ.5,000 చొప్పున ఎస్ఐపీ రూపంలో 20 ఏళ్ల పాటు పెట్టుబడి ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మెుత్తం కాలంలో మీరు రూ.12 లక్షలు పెట్టుబడిగా పెడతారు. 12 శాతం సగటు రాబడిని పరిగణిస్తే మెుత్తం రూ.37,95,740 వడ్డీని పొందుతారు. అంటే 20 ఏళ్ల కాలం పూర్తైన తర్వాత ఈ మెుత్తం రూ.49,95,740 అంటే ఇంచు మించు రూ.50 లక్షలు పొందుతారు. అయితే ఈ పెట్టుబడిని మరో ఐదేళ్ల పాటు కొనసాగిస్తే రూ.94,88,175 రాబడిగా పొందవచ్చు. ఇదే సమయంలో 15 శాతం రాబడిని పొందినట్లయితే మరింత భారీ మెుత్తాన్ని పిల్లల పెళ్లి లేదా చదువు అవసరాల కోసం పొందవచ్చు.


Click it and Unblock the Notifications