Pension Planning: నెలకు రూ.2 లక్షలు పెన్షన్ కావాలా..?? ఇలా ప్లాన్ చేసుకోండి..
Pension Planning: ప్రస్తుత కాలంలో అధిక ద్రవ్యోల్బణంతో అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది తమ భవిష్యత్తు రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలని యోచిస్తున్నారు.
ఇలాంటి వారికి ప్రభుత్వం అందిస్తున్న జాతీయ పెన్షన్ పథకం(NPS) స్కీమ్ పదవీ విరమణ తర్వాత మంచి ఆదాయాన్ని అందించే మంచి ఎంపికగా ఉంది. తొందరగా దీనిని ప్లాన్ చేసుకోవటం ద్వారా అవసరాలకు తగినట్లుగా నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు వెసులుబాటు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కీమ్ కింద పెట్టుబడిదారులు మెచ్యూరిటీ సమయంలో 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు, మిగిలిన దాన్ని యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలుకు వినియోగించాలి. అయితే 100 శాతం యాన్యుటీని ఎంచుకునేందుకు సైతం అవకాశం ఉంది.

ఉదాహరణకు మీ వయస్సు 40 సంవత్సరాలైతే.. ప్రతినెల రూ.2 లక్షలు పెన్షన్ పొందాలనుకున్నట్లయితే 20 ఏళ్ల పాటు NPS పథకంలో పెట్టుబడికి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. రూ.2 లక్షల పెన్షన్‌ను పొందాలంటే 20 ఏళ్లలో 6 శాతం రాబడిని పరిగణిస్తే దీనికోసం రూ.4.02 కోట్ల మెచ్యూరిటీ కార్పస్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో మీరు రూ.1.61 కోట్లకు సమానమైన 40 శాతం యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన రూ.2.41 కోట్లను విత్‌డ్రా చేసుకోవచ్చు.
20 ఏళ్లలో రూ.4 కోట్ల కంటే ఎక్కువ జమ చేయడానికి.. 10 శాతం రాబడిని అంచనావేసినట్లయితే ప్రతి నెలా రూ.52,500 ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టాలి. ఇది మెచ్యూరిటీ నాటికి రూ.4.02 కోట్ల కార్పస్‌ను చేరుకోవడానికి మీకు సహాయపడుతుంది. సురక్షితమైన పదవీ విరమణను ప్లాన్ చేసుకుంటున్నట్లయితే NPS ఒక సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications