Free Petrol: ప్రస్తుత ఆధునిక సమాజంలో మనిషుల మనుగడకు ఇంధనం చాలా కీలకంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా కనీసం పరోక్షంగానైనా అది ముడిపడి ఉంటుంది. ఈ వాస్తవం మనం శ్రీలంక ప్రస్తుత పరిస్థితి నుంచి బాగా అర్థం చేసుకోవచ్చు. జనజీవం స్తంభించటమే కాక అస్థవ్యవస్థమవుతుంది.

చుక్కలను అంటుతున్న ధర..
కరోనాకతో జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. దాని నుంచి క్రమంగా బయట పడుతున్నాం.. అనుకునేలోగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి. గ్యాస్, నిత్యావసరాలు సైతం అదే దారిలో నడుస్తున్నాయి. ఉపసమన చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ.. పెట్రోల్ మాత్రం సెంచరీకి దగ్గరే ఉంది. దీని వల్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సైతం భారంగా మారుతోంది. దూర ప్రయాణాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి.

పెట్రోల్‌కు పెరిగిన బడ్జెట్..
ఇంతకుముందు కంటే ప్రజలు ప్రస్తుతం పెట్రోల్‌కు కొంత ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని చాలా మంది వాపోతున్నారు. దీంతో చాలా మంది పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం మారుతున్నారు. మధ్య తరగతి వారు వీలైనంత తక్కువగా తమ వాహనాలకు పనిచెబుతున్నారు.

ఉచితంగా పెట్రోల్.. అవును నిజంగా..!
పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఉచితంగా లభిస్తుందని తెలిస్తే ఎలా ఉంటది. అవును ఇది నిజమే ఇందుకు ఒక మార్గం ఉంది. కొన్ని నియమనిబంధనలు సైతం ఉన్నాయి. అదేటంటే.. సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకొని ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్ ను తెచ్చింది. దీనిని పొందిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ పెట్రోల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

68 లీటర్ల పెట్రోల్ Free..
సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ ఉన్న వారికి ఏకంగా ఏడాదికి 68 లీటర్ల పెట్రోల్ ఉచితంగా అందుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా క్రెడిట్ కార్డును వినియోగించి ట్రాన్సాక్షన్స్ చేయటమే. అదెలాగో ఇప్పుడు తెలుసుకుని మీరు ఫ్రీ పెట్రోల్ కొట్టెయండి.

పెట్రోల్ కోసం రివార్డ్ పాయింట్స్..
చెల్లింపుల కోసం ఈ కార్డును వినియోగించినప్పుడు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. వీటిని టర్బో పాయింట్స్ అని పిలుస్తారు. మీరు చేసే ప్రతి రూ.150 ట్రాన్సాక్షన్ కు గాను 4 పాయింట్లు లభిస్తాయి. అలా ఏడాదికి కార్డు వినియోగించి రూ.30 వేలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు చేస్తే యాన్యువల్ ఛార్జీలు ఉండవు. సూపర్ మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లలో రూ.150 చెల్లింపుకు కేవలం 2 టర్బో పాయింట్లు లభిస్తాయి. ఇతర ట్రాన్సాక్షన్లకు ఒకటి చొప్పుడు అందించటం జరుగుతుంది. ఒక్కో పాయింట్ ఒక్కో రూపాయికి సమానం. ఇలా వచ్చిన డబ్బుతో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సిటీ బ్యాంక్ వెబ్ సైట్ చెక్ చేయండి. ఇంకెందుకు బాస్ ఆలస్యం మీరూ దీనిని వినియోగించుకోండి.


Click it and Unblock the Notifications