Car Insurance: వరదల్లో మీ కారు దెబ్బతిందా..?? క్లెయిమ్ ఎలా పొందాలో తెలుసుకోండి..
Car Insurance: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాల వల్ల అనేక కార్లు దెబ్బతింటున్నాయి. అయితే వీటికి సంబంధించిన క్లెయిమ్స్ సులువుగా పొందటం గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వరదలు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల నివాసాల్లోకి నీరు చేరుకోవటంతో వాహనాలు దెబ్బతింటున్నాయి. వరదకు కార్ కొట్టుకుపోతే ముందుగా వాహన యజమాని సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలి. కారు దొరకని పక్షంలో ఇన్సూరెన్స్ కంపెనీ కారు బీమా చేసిన డిక్లేర్డ్ విలువ(IDV)ని చెల్లిస్తుంది. మరమ్మత్తుల ఖర్చు IDVలో 75% మించి ఉంటే, IDVకి సమానమైన మొత్తాన్ని బీమాదారు చెల్లించాలి.

మీ వాహనం పాడైనా లేక కోల్పోయినా వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. వాహనం పాడైపోయినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. వాహనాన్ని గ్యారేజీకి తీసుకెళ్లడంలో బీమా సంస్థ మీకు సహాయం చేస్తుంది. మీరు క్లెయిమ్ ఫారమ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీని అందించాలి. క్లెయిమ్‌కు సంబంధించిన అన్ని పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించండి. వాహనం పూర్తిగా రిపేర్ అయిన తర్వాత మీరు మీ వాటాను చెల్లించి వాహనాన్ని యజమాని తీసుకోవచ్చు. మిగిలిన మెుత్తాన్ని ఇన్సూరెస్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఒక వేళ వాహనాన్ని మరమ్మత్తు చేయలేకపోతే.. బీమా కంపెనీ దానిని విక్రయించి అగ్రిమెంట్ ప్రకారం బీమా సొమ్మును చెల్లిస్తుంది.
వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి బీమా కంపెనీ ఒక సర్వేయర్ లేదా గ్యారేజీని నియమిస్తుంది. ఆ తర్వాత వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారు. బీమా కంపెనీ చెల్లించాల్సిన మొత్తం, మీరు భరించాల్సిన మొత్తం అంచనా తర్వాత తెలియజేయబడుతుంది. ఇలా సులువుగా వాహన ఇన్సూరెన్స్ కలిగిన వ్యక్తులు తమకు జరిగిన నష్టాన్ని పాలసీ కొనుగోలు చేసిన కంపెనీ నుంచి పొందవచ్చు.


Click it and Unblock the Notifications