IPO News: గ్రేమార్కెట్లో దున్నేస్తున్న బజాజ్ ఐపీవో, అలాట్మెంట్ స్టేటస్ తెలుసుకోండిలా..
Bajaj Housing Finance IPO: దేశంలోని అతిపెద్ద ఐపీవోల్లో ఒకటిగా వస్తున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు అరంగేట్రానికి ముందే రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే చాలా మంది పెట్టుబడిదారులు ఐపీవోలో షేర్ల కోసం బెట్టింగ్ వేశారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లలో ఉత్కంఠ కొనసాగుతోంది.
రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సోమవారం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అది పూర్తైంది. ఇష్యూ తెరవకముందే కంపెనీ శుక్రవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,758 కోట్లను సమీకరించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీవో కోసం ఒక్కో షేరు ధర రూ.66-70గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. మెుత్తం రూ.6,560 కోట్ల విలువైన ఐపీవోలో రూ.3000 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉందని కంపెనీ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా తాజా ఐపీవో తీసుకురాబడింది. ప్రముఖ అప్పర్ లేయర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు సెప్టెంబర్ 2025 నాటికి స్టాక్ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడాలని సెంట్రల్ బ్యాంక్ సూచించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న స్టాక్ మార్కెట్లలో జాబితాకానున్నాయి.

అలాట్‌మెంట్ తనిఖీ చేయండిలా..
1) https://www.bseindia.com/investors/appli_check.aspxని సందర్శించండి.
2) ఇష్యూ టైప్ కింద.. ఈక్విటీపై క్లిక్ చేయండి
3) ఇష్యూ పేరు కింద డ్రాప్‌బాక్స్‌లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ని ఎంచుకోండి.
4) అప్లికేషన్ నంబర్ రాయండి.
5) పాన్ కార్డ్ ఐడిని నమోదు చేయండి.
6) 'I am not a robot' పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.
మరో విధంగా కూడా తనిఖీ చేయవచ్చు..
1) ముందుగా Kfin Technologies Limited వెబ్ పోర్టల్‌కి వెళ్లండి.
2) డ్రాప్‌బాక్స్‌లో IPOను ఎంచుకోండి. దాని పేరు కేటాయింపు ఖరారు అయిన తర్వాత మాత్రమే పూరించబడుతుంది.
3) మీరు మూడు మోడ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది: అప్లికేషన్ నంబర్, డీమ్యాట్ ఖాతా నంబర్ లేదా PAN ID.
4) అప్లికేషన్స్ లో ASBA, నాన్-ASBA మధ్య ఎంచుకోండి.
5) దశ 2లో మీరు ఎంచుకున్న మోడ్ వివరాలను నమోదు చేయండి.
6) క్యాప్చాను పూరించి సబ్మిట్ నొక్కండి.


Click it and Unblock the Notifications