Tesla Car: ప్రాణాలు కాపాడిన టెస్లా కార్.. బుల్లెట్ దాడిని తట్టుకుని.. ఎలాన్ మస్క్ రియాక్షన్..
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఏది తయారు చేసినా పనితీరు విషయంలో అత్యుత్తమైనదిగా ఉంటుందని మరోసారి నిరూపించబడింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరులో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఇజ్రాయెల్ లో జరుగుతున్న పోరులో కిబ్బట్జ్ మెఫాల్సిమ్ నివాసి ప్రాణాలను టెస్లా కార్ రక్షించింది. హమాస్ ఉగ్రవాదులు చేసిన కాల్పులను తట్టుకుని టెస్లా అతడిని రక్షించిందనే వార్త ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఎలక్ట్రిక్ కారు కావటంతో ఇంధన ట్యాంక్ ఉండదని తీవ్రవాదులకు అర్థం కాలేదు దీంతో వారు తప్పుగా కారుపై కాల్పులు జరిపారు.

అతని కారు టైర్లు కాల్చివేయబడినప్పటికీ టెస్లా కారు వేగవంతమైన యాక్సిలరేషన్, డ్యూయల్-డ్రైవ్ సిస్టమ్.. దాడి చేసేవారి నుంచి సదరు కారులోని వ్యక్తిని దూరంగా ఉండటానికి, 112 mph వేగంతో దగ్గరలోని ఆసుపత్రికి చేరుకోవటానికి సహాయపడింది. అయితే ఈ క్రమంలో జరిగిన కాల్పుల కారణంగా కారుకు ఏకంగా 100 బుల్లెట్ రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. పైగా కారు పూర్తిగా మెరుగైన పనితీరుతో ఉంది. అలాగే భారీ డ్యామేజ్ తర్వాత కూడా కారులోని బ్యాటరీలు ఓవర్ హీట్ కాలేదని గుర్తించబడింది.
ఈ దాడి సమయంలో టెస్లా యాప్ ద్వారా కారులో ఉన్న వ్యక్తి భార్య రియల్ టైమ్ అప్‌డేట్స్ అందుకుంది. అతనికి సంబంధించిన లొకేషన్ వివరాలను యమర్జెన్సీ విభాగానికి అందించింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ ట్విట్టర్ లో ప్రత్యక్షం కావటంపై ఎలాన్ మస్క్ స్పందించారు. దీనిపై Glad he made it! అంటూ బదులిచ్చారు.


Click it and Unblock the Notifications