IT Returns 2024: కొత్త ఆదాయపు పన్ను టాక్స్ రూల్స్ ప్రభావం తెలుసా..?
New Tax Rules 2023: కేంద్ర బడ్జెట్ 2023లో భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను కోసం అనేక కొత్త నిబంధనలను ప్రకటించింది. దేశంలో చాలా కాలంగా ప్రజలు కోరుతున్న మేరకు పన్ను శ్లాబ్ రేట్లలో కీలక మార్పులను ప్రకటించింది. వాస్తవానికి నేడు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు చివరి రోజు గడువు కావటంతో చాలా మంది టాక్స్ ఫైలింగ్ పనిలో బిజీగా ఉన్నారు.
2023-24 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను విధానంలో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచుతుందని తెలిపారు. అలాగే కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ చేసింది. ఎలాంటి టీడీఎస్ క్లెయిమ్ చేయనివారి విషయంలో కొత్త పన్ను విధానం ప్రకారం టాక్స్ లెక్కింపబడుతుంది. ఈ క్రమంలో గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఆదాయం పన్ను రహితమైనదిగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

కొత్త పన్ను విధానం కింద శ్లాబ్ రేట్లను పరిశీలిస్తే..
- రూ.3 లక్షల వరకు ఆదాయంపై జీరో పన్ను
- రూ.3 లక్షల నుంచి 6 లక్షల మధ్య 5% పన్ను వర్తిస్తుంది
- రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షలపై 10% పన్ను వర్తిస్తుంది
- రూ.9 లక్షల నుంచి 12 లక్షల రూపాయలపై 15% పన్ను వర్తిస్తుంది
- రూ.12-15 లక్షలపై 20% పన్ను వర్తిస్తుంది
- రూ.15 లక్షలపై 30% పన్ను వర్తిస్తుంది
కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్: రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ యూనియన్ బడ్జెట్ 2023లో కొత్త పన్ను విధానానికి పొడిగించబడింది. దీంతో మెుత్తం పన్ను రహిత ఆదాయం రూ.7.5 లక్షలకుగా ఉంది.
మార్చి 31, 2023 తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో చేసిన పెట్టుబడులు, ఉపసంహరణపై దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్నుకు అర్హులు కాదని కేంద్రం తెలిపింది. అంటే డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై మూలధన లాభాలపై పన్ను చెల్లింపుదారుల ఆదాయ స్లాబ్‌ల ప్రకారం పన్ను విధించబడుతుంది. లాభాలపై ఇండెక్సేషన్‌తో LTCG పన్ను విధించబడదు. నివాస ప్రాపర్టీ అమ్మకం ద్వారా వచ్చే మూలధన లాభాల నుంచి క్లెయిమ్ చేయగల గరిష్ట మినహాయింపుపై కేంద్రం రూ.10 కోట్ల పరిమితిని విధించింది.


Click it and Unblock the Notifications