Tata Stocks Today: దేశంలో చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరికీ సుపరిచతమైన పేరు రతన్ టాటా. ఆయన వ్యాపారంలోనే కాకుండా దాతృత్వంతో కోట్ల మంది భారతీయుల జీవితాలను పెద్ద మలుపుతిప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కీలకమైన రంగాల్లో టాటా గ్రూప్ రతన్ టాటా నేతృత్వంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కంపెనీ ఇండియన్ బ్రాండ్ నుంచి గ్లోబల్ బ్రాండ్ స్థాయికి ఎగబడాకింది. అయితే రతన్ టాటా ఇక లేరు అని తెలిసిన వేళ ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ టాటా గ్రూప్ కంపెనీలు ఎలా రియాక్ట్ అవుతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..
నేడు మార్కెట్లు స్వల్ప లాభాలతో మెుదలైన సంగతి తెలిసిందే. అయితే టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా మృతి వార్తతో మార్కెట్ ప్రారంభమైన క్రమంలో అందరి దృష్టి టాటాలకు చెందిన లిస్టెడ్ కంపెనీ షేర్లపైన పడింది. ఈ క్రమంలో దాదాపుగా టాటాలకు చెందిన 16 కంపెనీల షేర్లలో ఆ ప్రభావవం కనిపించింది. ఈ క్రమంలో టీసీఎస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్, ట్రెంట్, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీస్ సహా మరిన్ని టాటా గ్రూప్ షేర్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో టీసీఎస్ స్టాక్ బీఎస్ఈలో దాదాపు ఒక శాతం లాభంతో రూ.4285 వద్ద కొనసాగుతుండగా.. మార్కెట్ క్యాప్ రూ.15.38 లక్షల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో టాటా స్టీల్ షేర్ స్వల్ప పెరుగుదలతో రూ.159 వద్ద, టాటా మోటార్స్ షేర్లు స్వల్ప క్షీణతతో రూ.933 వద్ద, టైటాన్ కంపెనీ షేర్లు దాదాపు 1 శాతం క్షీణతతో రూ.3461 వద్ద ఉన్నాయి.

ఇదే క్రమంలో టాటా కెమికల్ షేర్లు 6 శాతం లాభంతో రూ.1171 వద్ద, టాటా పవర్ స్టాక్ 2 శాతం లాభంతో రూ.470కి చేరుకోగా.. ఇండియన్ హోటల్స్ స్టాక్ 2 శాతం పెరిగి రూ.706 వద్ద ఉన్నాయి. అయితే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు మాత్రం కొంత నష్టంలో రూ.1115 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇక టాటా మెటాలిక్స్ ధర రూ.1111, వోల్టాస్ షేర్లు రూ.1789 వద్ద, టాటా కమ్యూనికేషన్ స్టాక్ రూ.1965, ట్రెంట్ లిమిటెడ్ షేర్లు రూ.8088, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ స్టాక్ రూ.7244 వద్ద కొనసాగుతున్నాయి. టాటా ELXI రూ.7803, నెల్కో లిమిటెడ్ షేరు రూ.1016, టాటా టెక్నాలజీస్ షేరు ధర రూ.1065 వద్ద ఉన్నాయి. దాదాపు మెజారిటీ టాటా గ్రూప్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగటం రతన్ టాటా తర్వాత రాబోయే లెగసీ క్యారియర్ పై ఇన్వెస్టర్ల భలమైన విశ్వాసానికి అద్ధం పడుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐటీ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం..
రతన్ టాటా మరణం నేపథ్యంలో టాటా గ్రూప్ ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి కంపెనీ నేడు జూలై-సెప్టెంబర్ రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను షెడ్యూల్ ప్రకారం ప్రకటించాల్సి ఉంది. అనే రతన్ టాటా మరణంతో నేడు వాస్తవానికి మార్కెట్ల ముగింపు తర్వాత 5.30కి జరగాల్సిన మీడియా సమావేశం క్యాన్సిల్ చేయబడింది. అయితే అనలిస్టులతో కాల్ సాయంత్రం 7 గంటలకు కొనసాగనుందని వెల్లడైంది. ప్రస్తుతానికి ఫలితాల ప్రకటన తాత్కాలికంగా వాయిదా వేయబడిందని తెలుస్తోంది.
నేడు సాయంత్రం 4 గంటలకు రతన్ టాటా అంతిమ సంస్కారాలు ముంబై వర్లీలో జరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి ప్రభుత్వ మర్యాదలతో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి అమిత్ షా కార్యక్రమాలకు హాజరవుతారని వెల్లడైంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications