SBIF Asha Scholarship: చాలా మంది పేద విద్యార్థులకు చదువుకోవాలని ఉంటుంది. అయితే వారి ఆర్థిక పరిస్థితులు స్థోమత సహకరించకోవటంతో చాలా మంది తమ చదువును అర్థాంతరంగా ముగిస్తుంటారు.
ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక చొరవ చూపిస్తోంది. పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు ఎస్‌బీఐ ఫౌండేషన్ స్కాలర్ షిప్ అందిస్తూ చేయూతనిస్తోంది. దీనిని 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే అర్హులైన విద్యార్థులకు అందిస్తోంది. ఎస్బీఐ ఆశా కింద దేశవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తోంది.

దీని కింద అర్హత పొందే విద్యార్థులు రూ.10 వేలను ఉపకారవేతనంగా అందుకుంటారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 30, 2023గా ఫౌండేషన్ వెల్లడించింది. ఆన్‌లైన్ ప్రక్రియలో విద్యార్థఉలు https://www.sbifoundation.in ద్వారా తమ దరఖాస్తును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. గత విద్యా సంవత్సరంలో 75 శాతం మార్కులు సంపాదించిన భారతీయ విద్యార్థులు ఎవరైనా ఇందుకు అర్హులే. అలాగే వారి కుటుంబ వార్హిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదనే నియమం కూడా ఉంది.
దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు బ్యాంక్ సూచించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు కార్డు, మార్క్స్ షీట్, ఫీజు రిసీట్, స్కూల్ ఐడీ కార్డు లేదా అడ్మిషన్ లెటర్, ఆదాయపు పన్నుకు సంబంధించిన ఫారం-16తో పాటు ఒక ఫోటో అందించాల్సి ఉంటుంది. మెుబైల్ నంబర్ లేదా జీమెయిల్ ఖాతాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అర్హులను గుర్తించటం జరుగుతుంది. చివరగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ చేయబడతారు.
ఈ ప్రక్రియలను విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్దుల ఖాతాల్లోకి స్కాలర్ షిప్ మెుత్తం నేరుగా జమ చేయబడుతుంది. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా విద్యార్థులు నేరుగా 011-43092248 నంబరుకు కాల్ చేయవచ్చు. ఇందులో 303 ఎక్స్టెన్షన్ నంబరును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications