PM SVANidhi: ప్రధాన మంత్రి స్వానిధి స్కీమ్ 2020లో కరోనా మహమ్మారి నేపథ్యంలో తీసుకురాబడింది. ఈ స్కీమ్ చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. ఇది వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం, అధిక వడ్డీ రేట్ల నుంచి రక్షణను కల్పించటం ధ్యేయంగా తీసుకొచ్చారు. సంక్షోభ సమయంలో నిధుల కొరతను తగ్గిస్తూ చిన్న వ్యాపారులు తిరిగి బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ఇది వీలు కల్పించింది.
ఈ పథకంలో లోన్లు మూడు సైకిల్స్ లో అందించబడతాయి.మొదటి సైకిల్‌లో అత్యధికంగా రూ.10,000 వరకు రుణాన్ని ఆర్థిక సంస్థలు అందిస్తాయి. అలాగే రెండవ సైకిల్‌లో రూ.20,000, ఇక చివరిగా మూడవ సైకిల్‌లో రూ.50,000 వరకు స్కీమ్ కింద చిన్న వీధి వ్యాపారులు రుణ సహాయాన్ని అందుకుంటారు. అయితే ఇక్కడ రీపేమెంట్ కాలాలు మూడింటికి వేరువేరుగా ఉంటాయి. ఒక సైకిల్ కింద రుణాన్ని విజయవంతంగా చెల్లించిన తర్వాత నెక్స్ట్ సైకిల్ కింద పెద్ద మెుత్తాన్ని రుణంగా తిరిగి పొందుతారు. అలాగే సమయానికి రూణం తిరిగి చెల్లించిన వారికి రూ.1,200 కాష్ బ్యాక్ ఇవ్వబడుతుంది. సకాలంలో రుణ చెల్లింపులు చేసిన వ్యాపారులు ఏడాదికి వడ్డీ రాయితీగా 7% సబ్సిడీ కూడా అందుకుంటారు.'

ఈ పథకానికి అర్హత పొందేందుకు వీధి వ్యాపారులు పండ్లు, కూరగాయలు, రెడీటు ఈట్ ఆహారం విక్రయించే వారు లేదా బార్బర్ షాపులు, బట్టలు ఎడ్జింగ్ వంటి సేవలను అందించే వారుగా ఉండాలి. అలాగే 2020 మార్చి 24 నాటికి పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు అర్హులుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ 2025లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం స్వానిధి పథకానికి సంబంధించి క్రెడిట్ కార్డుల ప్యాకేజీని ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన వివరాల ప్రకారం.. పీఎం స్వానిధి పథకం ద్వారా 68 లక్షల కంటే ఎక్కువ వీధి వ్యాపారులు ప్రయోజనాన్ని అందుకున్నారు. ఈ సక్సెస్ ను ఆధారం చేసుకుని కేంద్రం పథకాన్ని పునరుద్ధరించింది. బ్యాంకుల ద్వారా మెరుగైన లోన్లు, రూ.30,000 లిమిట్ కలిగిన క్రెడిట్ కార్డులు, UPI లింక్ చేయబడిన క్రెడిట్ కార్డులు వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. స్కీమ్ ప్రయోజనాలు పొందాలనుకునే వారు ఆధార్ కార్డు, ఓటర్ ID కార్డు వంటి KYC డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
స్కీమ్ కింద రుణాన్ని పొందటానికి వ్యక్తులు తమ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు వంటి వాటిని కూడా వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. పథకం ద్వారా వీధి వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మోదీ సర్కార్ భావిస్తోంది. గడ్డు కాలంలో వ్యాపారులు తిరిగి తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ చిన్న రుణాలు పెద్ద అండగా నిలిచాయని చాలా మంది స్కీమ్ ప్రయోజనాలు అందుకున్న ప్రజలు చెబుతున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications