Mutual Funds: కోటీశ్వరులుగా మారటానికి సిప్ టెక్నిక్.. ప్లాన్ పక్కా వర్కౌట్ అవ్వుద్ది..
Monthly SIP: ప్రస్తుత కాలంలో చాలా మంది పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లను సంపద సృష్టికి మార్గంగా ఎంచుకుంటున్నారు. రిస్క్ ఉన్నప్పటికీ రిటర్న్ కూడా ఉంటుందని వారు చాలా మంది భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించటానికి సాధారణ బ్యాంక్ పెట్టుబడుల రాబడి సరిపోకపోవటంతో చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లను ఉత్తమమైనవిగా భావిస్తున్నారు.
ఈ క్రమంలో సాధారణ రిటైల్ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ దేశీయ స్టాక్ మార్కెట్లలో పెరిగింది. అయితే చాలా మంది మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీ పెట్టుబడుల ద్వారా తమ దీర్ఘకాలిక అవసరాల కోసం పెట్టుబడులు పెడుతుండటంతో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పైగా రిస్క్ రిటర్న్ ఆదారంగా వివిధ వ్యక్తులకు అవసరమైన స్థాయిలో అనేక స్కీమ్స్ అందుబాటులో ఉండటం కారణంగా మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీర్ఘకాలంలో సగటున మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుంచి 12-16 శాతం మధ్య రాబడులను పెట్టుబడిదారులు అందుకున్నారు.

స్థిరంగా ఇతర సాధనాల కంటే మార్కెట్లో ఎక్కువగా రాబడిని అందిస్తున్న మ్యూచువల్ ఫండ్లలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఎస్ఐపీ రూపంలో పెట్టుబడులు పెట్టిన వారు ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారతారని సిప్ క్యాలిక్లేటర్ ద్వారా అంచనా వేయబడింది. ముందుగా కోటీ సంపాదించటానికి ఎంత పెట్టుబడి పెడితే ఎన్నేళ్లు పడుతుందో పరిశీలిద్దాం. నెలకు రూ.10,000ల పెట్టుబడితో ప్రారంభించి దానిని వార్షికంగా 10 శాతం చొప్పున పెంచుతూ పోతే 16 ఏళ్ల కాలంలోనే ఇన్వెస్టర్లు రూ.1.03 కోట్లను పొందుతారు. ఇక్కడ సగటున 12 శాతం రాబడిని పరిగణలోకి తీసుకోబడింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్ రూ.43,13,368 పెట్టుబడిగా పెట్టగా దానిపై రూ.60,06,289 ఆదాయం పొందుతారు.
ఇదే కోటి రూపాయల ఆదాయం టార్గెట్ నెలకు రూ.5000 పెట్టుబడితో కూడా సాధించవచ్చు. అదెలా అంటే ఎవరైనా ఇన్వెస్టర్ నెలకు 5 వేల రూపాయలు సిప్ స్టార్ట్ చేసి ఏటా 10 శాతం పెట్టుబడిని పెంచుతూ 21 ఏళ్ల పాటు దానిని కొనసాగిస్తే కోటి రూపాయల రాబడిని అందుకోగలరు. ఈ క్రమంలో సగటున 12 శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటే చివరికి రూ.1.16 కోట్లను రాబడిని అందుకోవటానికి అవకాశం ఉంటుంది.
ఈకాలంలో ఇన్వెస్టర్ రూ 38,40,150 పెట్టుబడిపై రూ.77,96,275 రాబడిని అందుకుంటారు. ప్రస్తుత కాలంలో అనేక అసట్ మేనేజ్మెంట్ కంపెనీలు చిన్న ఇన్వెస్టర్లను సైతం మార్కెట్లోకి స్వాగతిస్తూ కనీసం పెట్టుబడి మెుత్తాన్ని రూ.100 నుంచి అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇది శుభపరిణామం అయినప్పటికీ మార్కెట్లలో ఒడిదొడుకులు రాబడులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని ఇన్వెస్టర్లకు అవగాహన చాలా కీలకం.


Click it and Unblock the Notifications