Personal Loan: బ్యాంకింగ్ సేవలు డిజిటలైజేషన్ వేగంగా జరగటంతో ప్రజలకు ప్రస్తుతం లోన్స్ నుంచి పెట్టుబడుల వరకు అన్ని ఆర్థికపరమైన అంశాలు నిమిషాల్లో పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది సులువుగా రుణ సౌకర్యాలను పొందుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా పర్సనల్ లోన్స్ కి సంబంధించిన రూల్స్ లో రిజర్వు బ్యాంక్ కీలక మార్పులను చేసింది. దీని వల్ల ఏకకాలంలో అనేక పర్సనల్ లోన్స్ పొందుతున్న వ్యక్తులకు ఇబ్బందులు పెరగవచ్చని తెలుస్తోంది. మార్చబడిన రూల్స్ ప్రకారం రుణం ఇచ్చే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అటువంటి ఖాతాదారుల క్రెడిట్ బ్యూరో రికార్డులను 15 రోజుల్లోగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. గతంలో ఫైనాన్షియల్ సంస్థలు వీటిని నెలకు ఒకసారి అప్ డేట్ చేసేవి. ప్రస్తుతం కొత్త నిబంధనలు రుణగ్రహీతల నష్టాన్ని బాగా అంచనా వేసేందుకు దోహదపడుతోందని ఆర్బీఐ వెల్లడించింది.

పర్సనల్ లోన్స్ విషయంలో ఒకటి కంటే ఎక్కువ రుణాలను కలిగి ఉన్న వ్యక్తి సదరు ఈఎంఐలు వేరువేరు తేదీల్లో ఉంటాయి. ఈ క్రమంలో వాయిదా చెల్లించటంలో విఫలమైనప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని నెలకు ఒకసారి క్రెడిట్ రికార్డుల్లోకి ఎక్కించటం ద్వారా ఆర్థిక సంస్థలు సమాచారాన్ని పొందటానికి 40 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల వ్యక్తులు ఈ సమయంలో మరో ఫైనాన్స్ సంస్థ నుంచి ఈ కాలంలో రుణం పొందే అవకాశం ఉన్నందున ఆర్థిక సంస్థలపై ప్రభావం ఉంటుందని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది. అందుకే తరుచుగా పర్సనల్ లోన్స్ తీసుకునే వ్యక్తుల విషయంలో వివరాలను 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ చేయటం వల్ల జాప్యాలు తగ్గి డిఫాల్టర్ల వివరాలను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు వెంటనే పొందటానికి వీలు ఉంటుందని, తద్వారా సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలవని రిజర్వు బ్యాంక్ భావిస్తోంది.
వాస్తవానికి రుణాలను అందించే ఆర్థిక సంస్థలకు ఇది పెద్ద ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది రుణగ్రహీతలు పాత రుణాలను చెల్లించటం కోసం కొత్తగా మరో సంస్థ నుంచి రుణాన్ని పొందుతుంటారు. దీనిని ఎవర్ గ్రీనింగ్ అని పిలుస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు రుణ చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల రిజర్వు బ్యాంక్ పర్సనల్ లోన్స్ విషయంలో తెస్తున్న కొత్త నిబంధనలు ఆర్థిక సంస్థలకు రుణగ్రహీత గురించి స్పష్టమైన అభిప్రాయాన్ని పొందేందుకు దోహదపడతాయి. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ ఆగస్టు 2024లో దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని రుణ సంస్థలు, క్రెడిట్ బ్యూరోలు దీనికి తగినట్లుగా తమ సిస్టమ్‌లను అప్‌డేట్ చేసేందుకు జనవరి 1, 2025 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రజల్లో కూడా అనవసరంగా రుణాలు తీసుకునే ధోరణిని తగ్గిస్తుంది.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications