GST on Popcorn: దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏం నడుస్తోంది అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాప్‍కార్న్ పై పెంచి టాక్స్ రేట్ల గురించే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో మీమర్లు తమ బాధను పంచుకుంటున్నారు. ప్రపంచం అంతా కొత్త ఆవిష్కరణల్లో ఉంటే ఇండియాలో మాత్రం కొత్త పన్నులు పెంచే పనిలో ఉందంటూ చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గతవారం జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సినిమా థియేటర్లలో విక్రయించే పాప్‌కార్న్‌ను వర్గీకరించి పన్ను విధిస్తున్న తీరుపై స్పష్టమైన వివరణ ఇన్వబడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చేసిన అభ్యర్థన మేరకు థియేటర్లలో టబ్‌లలో విక్రయించే లూజ్ పాప్‌కార్న్‌పై రెస్టారెంట్ సేవలకు వర్తించే 5% GST రేటుతో పన్ను విధించబడుతుందని కౌన్సిల్ స్పష్టం చేసింది. కానీ సినిమా టిక్కెట్‌తో పాప్‌కార్న్‌ను కాంబోగా విక్రయించినప్పుడు పన్ను మారుతుంది. కాంబోగా విక్రయించినప్పుడు అది ప్రాథమిక వస్తువులపై విధించబడిన మిశ్రమ పన్నుగా పరిగణించబడుతుంది. ఈ కాంబోలో సినిమా టిక్కెట్లపై కల్పించే పన్ను ఆధారంగానే పన్ను విధిస్తామని కూడా క్లారిటీ వచ్చింది.

తాజా జీఎస్టీ సమావేశంలో పాప్‌కార్న్‌పై జీఎస్‌టీ రేటు పెంపుదల లేదనడం గమనార్హం. ఈ సమావేశంలో పాప్‌కార్న్‌పై పన్ను విధింపు సమస్యను పరిష్కరించేందుకు మాత్రమే వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో ఉప్పు మసాలా దినుసులతో చేసిన లూజ్ పాప్‌కార్న్‌లను "నమ్‌కీన్"గా వర్గీకరించి 5% GST రేటుకు లోబడి ఉంటుందని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే ముందుగానే ప్యాక్ చేసి లేబుల్ చేసిన పాప్‌కార్న్‌పై 12 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుందని కౌన్సిల్ వెల్లడించింది. ఇదే క్రమంలో కేరమిల్ పాప్‌కార్న్ మిఠాయి కేటగిరీలోకి వస్తున్నందున దానిపై 18 శాతం జీఎస్టీ రేటు అమలవుతుందని జీఎస్టీ కౌన్సిల్ స్పష్టతను ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇది భారీగా ట్రోలింగ్ కు సోషల్ మీడియా మాధ్యమాన్లో లోనవుతోంది.
పాప్‌కార్న్‌పై కొత్త పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేయలేదని బీజేపీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వింగ్ సభ్యుడు అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. తాజా స్పష్టీకరణ తప్పుడు పన్ను క్లెయిమ్‌లను నిరోధించడం, వినియోగదారులు, తయారీదారులకు ఉపశమనం కలిగించడంతో పాటుగా పన్ను వ్యవస్థలో స్పష్టతను తీసుకొచ్చే లక్ష్యంగా వచ్చింది. ఇది సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని, పన్ను చెల్లింపుదారులకు నిశ్చయతను అందిస్తుందని అమిత్ మాల్వియా వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం మరోలా జరుగుతోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications