Business Ideas: ఈ ఫ్రాంచైజీ తీసుకుంటే లక్షల్లో ఆదాయం.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Business Ideas: ఫుల్ టైమ్ ఉద్యోగం ఉన్నా అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని రోజులివి. పైగా ఉద్యోగంలో వంద ఆంక్షలు. అందుకే చాలా మంది యువత ప్రస్తుతం ప్రాచీనకాలంలో మాదిరిగా చిన్నదైనా సొంత వ్యాపారం బెటర్ అని భావిస్తున్నారు.
ప్రస్తుతం చిన్న గ్రామాల్లో సైతం ప్రజలు పాడిని పెంచటం మానేశారు. పనివారు దొరకక పోవటం, ఖర్చులు పెరగటం వంటి అనేక కారణాలతో వారు సైతం పాల ప్యాకెట్లను కొనుక్కుంటున్నారు. అయితే ఇది కొత్త వ్యాపార అవకాశాన్ని తెచ్చిపెడతోంది. దీనిని క్యాష్ చేసుకోవాలనుకునే వారు అమూల్ సంస్థ అందిస్తున్న పాల ఉత్పత్తుల విక్రయ ఫ్రాంచైజీ తీసుకోవటం ఉత్తమమైన మార్గం. ఇది రెగ్యులర్ ఆదాయాన్ని అందిస్తుంది. ఈ గుజరాతీ బ్రాండ్ దేశవ్యాప్తంగా ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించింది.

అమూల్ సంస్థ రెండు రకాల ఫ్రాంచైజీలను పంపిణీ చేస్తుంది. ఈ రెండు రకాల ఫ్రాంచైజీల ఖర్చు, ఆదాయాలు వేర్వేరుగా ఉంటాయి. అమూల్ తన ఉత్పత్తుల విక్రయించడంపై కమిషన్ ఇస్తుంది. దీనివల్ల స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. అమూల్ డెయిరీ ఉత్పత్తుల ఫ్రాంచైజీని ప్రారంభించేందుకు రూ.2 నుంచి రూ.6 లక్షల పెట్టుబడి అవసరం. దీనికోసం కంపెనీ చెప్పినట్లుగా ప్రధాన రహదారి పక్కన దుకాణం కలిగి ఉండాలి.
అమూల్ అవుట్‌లెట్ ప్రారంభించటానికి 150 చదరపు అడుగుల దుకాణం అవసరం. అలాగే అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ తెరవాలంటే కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి. పైగా అమూల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించాలంటే నాన్-రిఫండబుల్ సెక్యూరిటీగా రూ.25,000 చెల్లించాలి. అలాగే ఇంటీరియర్ కోసం రూ.లక్ష, పరికరాల కోసం రూ.75 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ఐస్ క్రీమ్ పార్లర్ స్టార్ట్ చేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ రూ.50 వేలు, మరమ్మతులకు రూ.4 లక్షలు, పరికరాలకు రూ.1.50 లక్షలు అవసరం ఉంటుంది.
కమిషన్ రూపంలో అమ్మే ఉత్పత్తులపై ఆదాయాన్ని మీరు పొందొచ్చు. పాల ప్యాకెట్లపై 2.5 శాతం, ఇతర పాల ఉత్పత్తులపై 10 శాతం, ఐస్ క్రీమ్ లపై 20 శాతం కమిషన్ అందిస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ https://amul.comను సందర్శించొచ్చు. అలాగే ఎలాంటి అనుమానాలు ఉన్నా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కంపెనీ అందించిన 022- 68526666 నంబరును సంప్రదించొచ్చు. కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకునే వారు కంపెనీ చెప్పిన మెుత్తాన్ని చెక్ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications