EPF News: తరచుగా ఉద్యోగాలు మారుతున్నారా? UAN నంబర్లో అనేక EPF ఖాతాలు కలిపేయండిలా..
EPF Tips: ప్రస్తుత కాలంలో యువత తరచుగా పనిచేస్తున్న కంపెనీలు మారటం చాలా సాధారణంగా మారిపోయింది. గతంలో మాదిరిగా ఒకే చోట పనిచేయటం కాకుండా తమ టాలెంట్, ఫైనాన్స్ అవసరాలు వంటి కారణాలతో చాలా మంది తరచుగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉద్యోగాలు మారిపోతున్నారు.
వాస్తవానికి యూఏఎన్ నంబర్ అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అందించే 12 అంకెలు కలిగిన విశిష్ట గుర్తింపు అంకె. దీని ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలను సులువుగా నిర్వహించుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని ఉద్యోగాలు మారినప్పటికీ ఒకటే యూఏఎన్ నంబర్ కొనసాగించవచ్చు. అయితే ప్రతి కంపెనీ మారినప్పుడల్లా ప్రత్యేక పీఎఫ్ ఖాతా పాస్‌బుక్ లను ఈ యూఏఎన్ నంబర్ కింద కొనసాగిస్తుంటాయి. దీని ద్వారా ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ మెయింటెనెన్స్ సులువుగా మారుతుంది.

ఒక ఉద్యోగి జాబ్ మారినప్పుడు కొత్త కంపెనీలో తన పాత యూఏఎన్ నంబర్ అందించాలి. అలాగే వారు తమ పాత కంపెనీలో పొందిన పీఎఫ్ పరిహారం బ్యాలెన్స్ మెుత్తాన్ని ప్రస్తుత ఖాతాకు తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్యోగులు పోర్టల్ లోని One member -One EPF account ఫెసిలిటీని వినియోగించుకోవచ్చు. ఒకసారి క్లెయిమ్ కోసం ఫామ్ పూర్తి చేసినట్లయితే అది యజమాని వద్దకు అనుమతి కోసం పంపబడుతుంది. ఈ క్రమంలో డబ్బు మెుత్తాన్ని ఏ ఖాతాలోకి ట్రాన్ ఫర్ చేయాలో ఎంచుకోవాల్సి ఉంటుంది. మునుపటి లేదా ప్రస్తుత యజమాని ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
PF బ్యాలెన్స్‌ను ఒక EPF ఖాతా నుండి మరొకదానికి బదిలీ చేయడానికి అభ్యర్థన తేదీ నుంచి సాధారణంగా 20 రోజులు పడుతుంది. ఇలా చేయటం వల్ల పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బును క్లెయిమ్ చేసినప్పుడు గందరగోళానికి గురికాకుండా ఒకే చోటు సొమ్ము ఉంటుంది. చాలా కాలం తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేస్తే, ఒకవేళ ఆ సమయంలో పాత కంపెనీ తీసివేయబడితే ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications