Retirement Planning: ఒక్కసారి రూ.11 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చేతికి రూ.3.3 కోట్లు, సూపర్ రిటైర్మెంట్ ప్లాన్..!

Retirement Investment: చిన్నపెట్టుబడితో కోటీశ్వరులుగా మారాలని మనలో ఎవరకి ఉండదు. అయితే నేటి కాలంలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం వంటి అనేక కారణాలతో ప్రజలు తప్పనిసరిగా రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా తక్కువ మంది సంతానం కలిగి ఉండటం కూడా ప్రజలను రిటైర్మెంట్ ప్లానింగ్ వైపు నడిపిస్తోంది.

అందుకే కరోనా లాంటి మహమ్మారిని చూసిన తర్వాత ప్రజలు నేటి తరంలో తమ రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే రాబడి అనే అంశం ప్రధానంగా మనం ఒకేసారి ఎంత ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాం.. దానిపై ఎంత వడ్డీ వస్తుంది అనే అంశంపైనే రాబడి ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా వ్యక్తి రూ.11 లక్షలు ఒక్కసారిగా పెట్టుబడి పెట్టడం ద్వారా కాంపౌండింగ్ అందించే సూపర్ రాబడిని ఎలా అందుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Know how one can make 11 lakhs investment into 3 crores retirement corpus

రిటైర్మెంట్ కార్పస్ ఎందుకు..?
రిటైర్మెంట్ కార్పస్ అనేది పదవీ విరమణ పొందిన తర్వాత ఉద్యోగికి జీవన వ్యయాలను తీర్చుకోవటానికి అవకాశం కల్పించే నిధి. అటువంటి కార్పస్‌ను నిర్మించడం వెనుక ఉన్న కీలకమైన అంశం చక్రవడ్డీ.. దీర్ఘకాలికంగా అదనపు ఆదాయాలను ఉత్పత్తి చేయడానికి రాబడిని తిరిగి పెట్టుబడి పెట్టే ప్రక్రియ. ఈ సహజ వృద్ధి విధానం ఒకేసారి పెట్టుబడి ద్వారా ఎలా రాబడులను తెచ్చిపెడుతుందనే మ్యాజిక్ పెట్టుబడిదారులు తప్పక తెలుసుకోవాల్సిన అంశం.

25 ఏళ్లలో రూ.3.3 కోట్లు సంపాదించండిలా..
దీర్ఘకాలంలో రిటైర్మెంట్ కార్పస్ సిద్ధం చేసుకునే వ్యక్తులు కోట్లలో రాబడిని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే దానిని రూ.11 లక్షల పెట్టుబడితో ఎలా సంపాదించాలనే ఆలోచన అందరిలోనూ ఉంది. దీనికోసం చేయాల్సిందల్లా సదరు పెట్టుబడి మెుత్తాన్ని ఏకకాలంలో వార్షికంగా 14.6 శాతం రాబడిని అందించే పెట్టుబడి సాధనంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికంటే ఎక్కువ రాబడిని అందుకుంటే రిటైర్మెంట్ సమయంలో మరింత ఎక్కువ సొమ్మును ఇన్వెస్టర్స్ పొందుతారు.

30 ఏళ్లలో రూ.3.3 కోట్లను అందుకోవాలంటే..
ఇదే రూ.11 లక్షల మెుత్తాన్ని రూ.3.3 కోట్లుగా మార్చాలంటే వార్షికంగా 12 శాతం రాబడిని అందించే పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ ఈ రాబడిని అందించటానికి అనుకూలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తుంటారు. ఇక్కడ తక్కువ పెట్టుబడిని ఎక్కువ రాబడిగా మార్చుతున్న ప్రధాన అంశం దీర్ఘకాలం పాటు పెట్టుబడి మెుత్తంపై చక్రవడ్డీని పొందటమే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+