Loan News: 8వ తగరతి పాసైతే చాలు.. రూ.50 లక్షల వరకు సబ్సిడీ లోన్ పొందొచ్చు.. పూర్తి వివరాలు
PMEGP Loan: ఒకరి కింద ఉద్యోగం చేయటం కంటే స్వయంగా చిన్న కంపెనీని ఏర్పాటు చేసుకునైనా ముందుకెళ్లాలని నేటి కాలంలో చాలా మంది భావిస్తున్నారు. అలాంటి చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణం గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సొంతంగా వ్యాపారం చేయాలని చాలా మంది కలలు కంటారు. కానీ పెట్టుబడి సరిపోకపోవడం, బ్యాంకు రుణాలు పొందడంలో ఇబ్బంది వంటి అనేక కారణాల వల్ల ఆ కల నెరవేరకపోవచ్చు. అలాంటి వారికి సహాయం చేసేందుకు ప్రధానమంత్రి పీఎంఈజీపీ పథకం రూపొందించబడింది. ఇది కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ(Mo MSME) ద్వారా నిర్వహించబడుతున్న కార్యక్రమం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్త వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు స్కీమ్ సబ్సిడీ క్రెడిట్ అందిస్తుంది.

స్కీమ్ కింద ఏదైనా మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించడానికి రూ.50 లక్షల వరకు, సర్వీస్ రంగానికి చెందిన కంపెనీ ఏర్పాటుకు రూ.20 లక్షల రుణాన్ని స్కీమ్ అందిస్తుంది. ఇక్కడ ప్రయోజనాలను పరిశీలిస్తే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 15% నుంచి 35% వరకు సబ్సిడీ అందుబాటులో ఉండనుంది. అయితే ప్రాజెక్ట్ వ్యయం పైన పేర్కొన్న స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మిగిలిన మెుత్తాన్ని సదరు వ్యాపారవేత్తలు బ్యాంకుల నుంచి పొందవచ్చని గుర్తుంచుకోండి.
PMEGP పథకం కింద ఇప్పటికే రుణాలు పొందిన కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు రెండవ రుణం పొందేందుకు వెసులుబాటు కల్పించబడింది. వ్యాపార విస్తరణ కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయం తయారీ రంగంలో రూ.కోటి, సేవా రంగంలో రూ.25 లక్షలు దాటితే మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవచ్చు. పీఎంఈజీపీ స్కీమ్ కింద ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించి సబ్సిడీ రుణాన్ని పొందేందుకు కనీస అర్హత 8వ తరగతి పూర్తి చేయాల్సిందిగా నిర్ణయించబడింది. కసాయి దుకాణం, ఔషధ సంబంధిత పరిశ్రమలు, మొక్కలు, మేకలు, చేపలు, పౌల్ట్రీ, పశువుల పెంపకం మొదలైన వ్యాపారాలను ప్రారంభించడానికి PMEGP పథకం వర్తించదు.
PMEGP స్కీమ్ కోసం దరఖాస్తుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, రూరల్ ఏరియా సర్టిఫికేట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, సిబిల్ స్కోర్ రిపోర్ట్ అవసరం కావచ్చు. దరఖాస్తుదారులు జిల్లాలోని అధికారులను దీనికోసం సంప్రదించవచ్చు. లేదా https://www.kviconline.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications