Aadhaar Card Loan: ప్రస్తుతం అంతా డిజిటల్ యుగంగా మారిపోయింది. దీంతో ప్రజలు సైతం తమ అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువగా రుణాలను తీసుకుంటున్నారు.
అనేక మంది కొత్త వ్యాపారాలను ప్రారంభించటానికో లేదా ప్రపంచ యాత్రలు చేసేందుకో లేదా ఇతర అత్యవసర అవసరాల కోసం పర్సన్ లోన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కేవలం ఆధార్ కార్డుపై రుణాన్ని పొందొచ్చనే సంగతి మనలో చాలా మందికి తెలియదు. దీనికోసం కొన్ని కనీస ధృవ పత్రాలను అందించాల్సి ఉంటుంది. మార్కెట్లో ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ బజాజా ఫిన సర్వ్ ఈ కేటగిరీ కింద గరిష్ఠంగా రూ.40 లక్షల వరకు లోన్ అందిస్తోంది.

పైగా ఈ రుణాన్ని ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవటం ద్వారా అర్హత కలిగిన వ్యక్తులు నిమిషాల్లో పొందవచ్చని అధికారిక వెబ్‌సైట్ లో వెల్లడించింది. పైగా దీనికోసం దరఖాస్తుదారులు ఎలాంటి ఆస్తిని సెక్యూరిటీగా తనఖా పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్షణాల్లో రుణాన్ని పొందేందుకు దరఖాస్తుదారులు తమ ఆదాయ ధృవీకరణ పత్రంతో పాటు ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణానికి అర్హత పొందినట్లయితే ఆ మెుత్తం నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేయబడుతుంది.
గరిష్ఠంగా 24 గంటల సమయంలో రుణ మెుత్తం జమ అవుతుందని వెల్లడించింది. రుణాన్ని 96 నెలసరి వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు అందుబాటులో ఉంది. దీనికోసం దరఖాస్తుదారులు 21-80 ఏళ్ల మధ్య వయస్సులో ఉండాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి కనీస జీతం రూ.25,000లకు పైగా ఉండాలని వెల్లడించింది. అలాగే సిబిల్ స్కోర్ 685 పాయింట్లకు పైన ఉండాలని స్పష్టం చేసింది. నాన్ బ్యాంకింగ్ సంస్థ బజాజ్ ఫిన్ సర్వ్ అంతర్గత అర్హతలు పూర్తిగా ఉన్నట్లయితేనే దరఖాస్తుదారులు రుణాన్ని పొందగలరని షరతులు వర్తిస్తాయని వెల్లడించింది.


Click it and Unblock the Notifications