Loan: పర్సనల్ లోన్, హోమ్ లోన్ వంటి రుణాల కోసం చాలా మంది ప్రస్తుతం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫైనాన్స్ కంపెనీ ముందుగా చూసేది సదరు వ్యక్తి క్రెడిట్ స్కోర్. ఇది చాలా కీలకమైనది కూడా.
మీ క్రెడిట్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉన్నట్లయితే.. రుణ ఆమోదం పొందడం చాలా కష్టతరంగా మారుతుంది. మీ స్కోర్ 600-649 మధ్య ఉన్నట్లయితే లోన్ పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే 650-699 క్రెడిట్ అర్హత సంతృప్తికరం లోన్ ఆమోదం సాధ్యమే. అలాగే 700-749 మధ్య స్కోర్ ఉండటం లేదా అంతకంటే ఎక్కువ ఉండటం మంచి రేటుకు రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ పర్సనల్ లోన్ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

స్థిరమైన ఆదాయం:బ్యాంకులతో సహా ఇతర రుణ సంస్థలు తరచుగా స్థిరమైన ఆదాయ వనరు కలిగిన రుణగ్రహీతలకు ప్రాధాన్యత ఇస్తాయి. శాలరరీ స్లిప్, జాబ్ లెటర్ లేదా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ పత్రాలు వంటి ఉద్యోగ రుజువును అందించవచ్చు. మీరు ఎక్కువ కాలం పాటు ఒకే కంపెనీలో ఉన్నట్లయితే అది మీ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
తక్కువ రుణ-ఆదాయ నిష్పత్తి:మీ రుణం-ఆదాయ నిష్పత్తి అనేది మీ ఆదాయానికి వ్యతిరేకంగా మీ రుణం మొత్తాన్ని కొలవడం. తక్కువ రుణ నిష్పత్తి మీరు అదనపు రుణాన్ని తీసుకున్నప్పటికీ తిరిగి చెల్లించడానికి మీకు తగినంత ఆదాయం ఉందని చూపిస్తుంది. మీ లోన్ మొత్తం మీ ఆదాయం కంటే చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి. ఈ నిష్పత్తిని మెరుగుపరచడానికి, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు, కార్ లోన్‌లు లేదా ఏదైనా ఇతర బకాయి ఉన్న రుణాలతో సహా కొత్త రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఇప్పటికే ఉన్న రుణాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి.
సహ-దరఖాస్తుదారు:కుటుంబ సభ్యుడు లేదా జీవిత భాగస్వామి వంటి సహ-దరఖాస్తుదారుడితో(Co-Applicant) రుణం కోసం దరఖాస్తు చేయడం వలన మీ రుణ ఆమోద అవకాశాలు పెరుగుతాయి. సహ-దరఖాస్తుదారుడి క్రెడిట్ స్కోర్, ఆదాయం మీ స్వంత లోపాలను భర్తీ చేయగలవు. రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత మీ ఇద్దరికీ సమానంగా ఉంటుంది.
అదనపు డాక్యుమెంట్లు:సాధారణ అవసరమైన డాక్యుమెంట్‌లు కాకుండా అదనపు డాక్యుమెంట్‌లను అందించడం మీ లోన్ అప్లికేషన్‌ను బలోపేతం చేస్తుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వంటి అదనపు పత్రాను బ్యాంకులకు అందించవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని వివరంగా, పారదర్శకంగా చూపుతుంది. ఇలా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉండే వ్యక్తులు కూడా సులువుగా రుణాలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications