రోజుకు రూ.7 ఇలా దాచుకుంటే నెలకి రూ.5000 పెన్షన్..! పక్కా ప్లాన్ మీకోసం..
Atal Pension Yojana: ప్రస్తుత కాలంలో ద్రవ్యోల్బణం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని వయస్సు మీదపడ్డప్పుడు పొందాలని మనలో చాలా మంది చూస్తుంటాం. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన లో సేవింగ్ హై రిటర్స్ ప్లాన్ సిద్ధంగా ఉంది. పైగా ఇది పూర్తిగా ప్రభుత్వ హామీని కలిగి ఉండటం విశేషం.
చాలా మంది ప్రజలు ముందస్తు జాగ్రత్తలో భాగంగా వృద్ధాప్యం కోసం ఇప్పటి నుంచే డబ్బును దాచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అది భవిష్యత్తులో వారి రోజువారీ అవసరాలను తీర్చుకునేందుకు క్రమమైన ఆదాయంగా ఉపయోగపడుతుంది. పెన్షన్ ప్లానింగ్ లేకపోతే పదవీ విరమణ తర్వాత కనీస అవసరాలు తీర్చుకునేందుకు సైతం ఇతరులపై ఆధారపడాల్సి రావొచ్చు. అందుకే జీవితంలో ముందుచూపు ఉన్నవారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన స్కీమ్ గొప్పది.

అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టేందుకు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు. మీరు చిన్న వయస్సులో అంటే 18 ఏళ్లకే పెట్టుబడి పెట్టడం ప్రారంభించినట్లయితే.. చెల్లించాల్సిన వాయిదా మెుత్తం తక్కువగా ఉంటుంది. దేశంలో ఆదాయపు పన్ను చెల్లించని వ్యక్తులు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ఎవరైతే 18 ఏళ్ల వయస్సులోనే పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. వారు నెలకు రూ.210 అంటే రోజుకు కనీసం రూ.7 పెట్టుబడికోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల 60 ఏళ్ల వయస్సులో సదరు వ్యక్తి నెలకు రూ.5000 పెన్షన్ రూపంలో తిరిగి పొందుతారు.
అలాగే వ్యక్తి వయస్సును బట్టి చెల్లించాల్సిన నెలవారీ పెన్షన్ మెుత్తాన్ని గమనిస్తే.. 19 ఏళ్లకు రూ.228, 20 ఏళ్లకు రూ.248, 21 ఏళ్లకు రూ.269, 22 ఏళ్లకు రూ.292, 23 ఏళ్లకు రూ.318, 24 ఏళ్లకు రూ.346, రూ. 25 ఏళ్లకు రూ.376, 26 ఏళ్లకు రూ.409, 27 ఏళ్లకు రూ.446, 28 ఏళ్లు రూ.485, 29 ఏళ్లు రూ.529, 30 ఏళ్లు రూ.577, 31 ఏళ్లు రూ.630, 32 ఏళ్లు రూ.689, 33 ఏళ్లు రూ.752, 34 సంవత్సరాలకు రూ. 824, 35 ఏళ్లు రూ. 902, 36 ఏళ్లు రూ. 990, 37 ఏళ్లు రూ. 1087, 38 ఏళ్లలో 1196 రూపాయలు, 39 ఏళ్లలో 1318 రూపాయలు, 40 ఏళ్లలో రూ.1454గా ఉంది. స్కీమ్ కోసం ముందుగా వ్యక్తి ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. తద్వారా స్కీమ్ కోసం బ్యాంకును సంప్రదించి ఫారమ్ పూరించటం ద్వారా పెట్టుబడులను ప్రారంభించవచ్చు.


Click it and Unblock the Notifications