YSR Arogya Aasara: ప్రతిష్ఠాత్మకంగా YSR ఆరోగ్య ఆసరా.. అర్హులకు ప్రతి నెల రూ.5 వేలు..
YSR Arogya Aasara: సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యంపై ఎంత భారీగా దృష్టి సారించారనే విషయం అందరికీ తెలిసిందే. ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్యసేవల సంఖ్యను సైతం ముఖ్యమంత్రి పెంచారు. ఇలా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిలో మంచి ప్రజాధరణ పొందిన వాటిలో ఒకటి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో జగర్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద అర్హులకు ప్రతి నెల రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం గుర్తించిన 836 శస్త్రచికిత్సల్లో ఏదైనా ఆరోగ్యశ్రీ కింద చేయించుకున్నట్లయితే.. విశ్రాంతిలో ఉన్న సమయంలో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

ఏపీ సర్కార్ నుంచి ఈ స్కీమ్ పొందటానికి కొన్ని అర్హతలు ఉండాలి. నిబంధనల ప్రకారం సదరు వ్యక్తి ఏపీలో శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాగే ఈ పథకాన్ని SC, OBC, మైనారిటీ వర్గాలకు చెందిన రిజర్వ్డ్ కేటగిరీ వ్యక్తుల కోసం ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి కింద లబ్దిదారులు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్ఠంగా రూ.5 వేలను పొందుతారు. బీపీఎల్ కుటుంబానికి చెందిన పేదలు ఈ పథకం లబ్ధిదారులని నిర్ణయించారు. దీనిని సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ 2న రాష్ట్రంలోని ప్రజల కోసం ప్రారంభించారు.

దీనికింద అర్హులను గుర్తించిన తర్వాత ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బును జమచేస్తుంది. దీనికోసం వారు అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆధార్ కార్డ్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ట్రీట్ మెంట్ డాక్యుమెంట్స్, డిశ్చార్జ్ డాక్యుమెంట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్ కం సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్తమ పథకాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications