PPF News: రూ.40 లక్షలు కార్పస్ కావాలంటే పీపీఎఫ్ లో ఎంత పొదుపు చేయాలి..? ఇదిగో లెక్క..
PPF Calculation: దేశంలో ప్రజలకు అనేక దశాబ్ధాలుగా పెట్టుబడి అవకాశాలను అందిస్తున్న నమ్మకమైన సంస్థల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి. ఒకప్పుడు కేవలం ప్రజలకు ఉత్తరాలు, మనీ ఆర్డర్లు డెలివరీ ఇచ్చిన ఈ సంస్థ తర్వాతి కాలంలో రూపాతరం చెంది అనేక కొత్త సేవలతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రజలకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సహా అనేక ఇతర పెట్టుబడి సౌకర్యాలను ఈ ప్రభుత్వ సంస్థ అందించటం ప్రారంభించింది.
పోస్టల్ డిపార్ట్మెంట్ అందిస్తున్న పెట్టుబడి సాధనాల్లో ఎక్కువగా ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. పీపీఎఫ్ అని పిలువబడే ఈ పెట్టుబడి మార్గాన్ని ప్రజలు దీర్ఘకాలిక అవసరాలకు లేదా రిటైర్మెంట్ అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఎవరైనా వ్యక్తి కనీసం రూ.500 పెట్టుబడితో ఈ పీపీఎఫ్ ఖాతాను తెరవవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ స్కీమ్ కింద పెట్టుబడిపై 7.1 శాతం వరకు వడ్డీ ఆదాయాన్ని అందిస్తోంది. అలాగే ఏడాదికి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలను కూడా ప్రజలు పొందుతారు.

పీపీఎఫ్ ఖాతాను వ్యక్తులు బ్యాంకింగ్ సంస్థలు లేదా పోస్టల్ డిపార్ట్మెంట్ రెండింటిలో ఎక్కడైనా తెరవవచ్చు. ఇందుకోసం కనీసం 18 ఏళ్ల వయస్సు ఉంటే సరిపోతుంది. మైనర్ల పేరుపై ఖాతా ఓపెన్ చేయటానికి చట్టపరమైన గార్డియన్ కి అవకాశం కల్పించబడింది. ఈ ఖాతా 15 ఏళ్ల తర్వాత మెచూర్ అవుతుంది. చివరికి వ్యక్తులు తమ పాస్ బుక్ సబ్మిట్ చేయటం ద్వారా డబ్బును తిరిగి పొందవచ్చు. అయితే మెచ్యూరిటీ గడవు ముగిసిన తర్వాత కూడా ప్రతి ఐదేళ్ల కాలానికి పెట్టుబడి కాలపరిమితిని పొడిగించుకునేందుకు అవకాశం కల్పించబడింది.
ఎవరైనా వ్యక్తి తన పెట్టుబడిని కనీసం ఖాతా తెరచిన 5 ఏళ్ల తర్వాత రిడీమ్ చేసుకోవటానికి వీలు ఉంటుంది. మెుత్తం బ్యాలెన్స్ లో 50 శాతం వరకు రిడీమ్ చేసుకోవటానికి అవకాశం కల్పించబడుతుంది. ఎవైనా వ్యక్తి నెలకు రూ.4 వేలు పెట్టుబడిగా 15 ఏళ్లు కొనసాగిస్తే వారు మెుత్తం రూ.13.01 లక్షలు తిరిగి మెచ్యూరిటీ సమయంలో పొందుతారు. అలాగే నెలకు రూ.8 వేల 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే చివరికి రూ.26.03 లక్షలను అందుకుంటారు. అలాగే నెలకు రూ.12 వేల పెట్టుబడిని కొనసాగిస్తే చివరికి రూ.39.05 లక్షలు చేతికి అందుకుంటారు.


Click it and Unblock the Notifications