Low Coat Loans: దేశంలోని అన్ని వర్గాల వారికి తక్కువ వడ్డీ రేట్లకు అవసరమైన రుణాలను అందించాలని చాలా కాలంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొస్తోంది. ఇవి ప్రజలను సొంత కాళ్లపై నిలబడి ఉపాధిని పొందేందుకు వీలు కల్పిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రధానిగా నరేంద్ర మోదీ రెండవ టర్మ్‌లో అధికారంలో ఉన్నప్పుడు పేద వర్గాలకు నేరుగా ప్రయోజనం కలిగించే అనేక స్కీమ్స్ తీసుకొచ్చారు. వాటిలో ప్రజలను ప్రస్తుతం ఆకట్టుకుంటున్న పీఎం విశ్వకర్మ స్కీమ్ గురించే. దీనిని ప్రధాని మోదీ సెప్టెంబర్ 17, 2023న ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు దాదాపు 13 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

చేతులు, పనిముట్లతో పనిచేసే చేతివృత్తుల వారితో సహా 18 వ్యాపారాలు ఈ స్కీమ్ పరిధిలో చేర్చబడ్డాయి. దీనికింద వడ్రంగులు, పడవ తయారీదారులు, ఆయుధ తయారీదారులు, కమ్మరి, పనిముట్లను తయారు చేసేవారు, తాళాలు వేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, రాళ్లను విరగొట్టేవారు ఉన్నారు. అలాగే చెప్పులు కుట్టేవారు, మేస్త్రీలు, బుట్టలు అల్లేవారు, సాంప్రదాయం బొమ్మల తయారీదారులు, బార్బర్‌లు, దండలు తయారు చేసేవారు, చాకలివారు, టైలర్లు, ఫిషింగ్ వల తయారీలో ఉన్న వారికి స్కీమ్ వర్తిస్తుంది.
గతంలో మోదీ ప్రకటించిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద అర్హులైన చేతిపనుల వారు రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే రుణం ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వబడుతుంది. లోన్ 18 నెలలు, 30 నెలల కాలవ్యవధికి 5 శాతం స్థిర రాయితీ వడ్డీ రేటుతో రూ.లక్ష, రూ.2 లక్షలు అనే రెండు విడతలుగా అందించబడుతుంది. ముందుగా ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులు రూ.లక్ష వరకు తొలి విడత రుణ సహాయాన్ని అందుకునేందుకు అర్హులు. దీనికి సక్రమంగా చెల్లింపులు చేపట్టే లబ్ధిదారులు రెంవడ విడత రుణాన్ని పొందవచ్చు. ఇక్కడ సదరు వ్యక్తులు తమ వ్యాపారంలో డిజిటల్ లావాదేవీలను అనుసరించటం తప్పనిసరని గుర్తుంచుకోవాలి.
పీఎం విశ్వకర్మ యోజన కింద రుణం పొందటానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఎవరైనా pmvishwakarma.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అలాగే పథకానికి సంబంధించిన ఏదైనా సమాచారం కోసం ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ మీరు 18002677777కి కాల్ చేయవచ్చు. అలాగే [email protected] ఈమెయిల్ ద్వారా కూడా సమాచారాన్ని అభ్యర్థించవచ్చు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications